Onion Price Hike: ఉల్లి ధర ఘాటుకు కన్నీళ్లు.. రోజు రోజుకు పెరుగుతున్న రేట్లు
X
ఉల్లి కోసినా ఘాటే.. కొన్నా ఘాటు అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. ఉల్లిపాయలు కొనాలంటేనే వాటి ధర ఘాటుకు కన్నీళ్లొస్తున్నాయి. మొన్నటి వరకు టమాటా రేట్లు భారీగా పెరగగా ఇప్పుడు ఉల్లిగడ్డ వంతు వచ్చింది. మొన్నటి వరకు కిలో రూ.20-25 పలికిన కిలో ఉల్లిగడ్డ రేటు రోజుల వ్యవధిలోనే భారీగా పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో ఏకంగా కిలో ఉల్లి రూ.80 పలుకుతోంది. ఘాజీపూర్ వెజిటేబుల్ మార్కెట్లో శుక్రవారం 5 కిలోల ఉల్లిగడ్డ ధర రూ.300 ఉండగా.. ఈ రోజు ఆ రేటు రూ.350కి చేరింది. ఒక్కసారిగా పెరిగిన ఉల్లి ధరతో సామాన్యులు హడలిపోతున్నారు. ఈ ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
రాష్ట్రంలోని అతి పెద్ద మార్కెట్ మలక్ పేట లోని మహబూబ్ మాన్షన్ మార్కెట్ (గంజ్) కు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల నుంచి.. రైతులు పెద్దఎత్తున ఉల్లి పంటను తీసుకొస్తుంటారు. కానీ ఆయా ప్రాంతాల్లో పంట దిగుబడి ఆలస్యం కావడం, మార్కెట్ లో స్కాక్ లేకపోవడందో ఉల్లి ధర భారీగా పెరిగిపోతుంది. మలక్ పేట మార్కెట్లో ఉల్లి ధర ఈ నెల ప్రారంభంలో క్వింటాల్‌కు రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఉండగా.. గత వారం నుంచి రూ.5 వేల నుంచి రూ. 7 వేల వరకు పెరిగింది. ఇదే పరిస్థితిలో సరఫరా కొనసాగితే, ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.