Home > జాతీయం > కొత్త పేరుతో వస్తున్న ప్రతిపక్షాల కూటమి

కొత్త పేరుతో వస్తున్న ప్రతిపక్షాల కూటమి

కొత్త పేరుతో వస్తున్న ప్రతిపక్షాల కూటమి
X

దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అటు ఢిల్లీలో అధికార కూటమి, ఇటు బెంగళూరులో విపక్షాల కుంపటి సమావేశమైన ఎన్నికల యుద్ధానికి కత్తులు నూరుతున్నాయి. ఎన్డీఏ భేటీకి 38 పార్టీలు, యూపీఏ భేటీకి 24 పార్టీలు హాజరై మంతనాలు జరుపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనాసరే గద్దె దింపాలన్నది విపక్షాల లక్ష్యం. విపక్షాల కూటమికి కొత్త పేరును కూడా ఖరారు చేశారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఒకే వేదికపైకి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అనే పేరును ఖరారు చేశాయి. భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్టి కూటమిగా నిర్ణయించాయి. అయితే దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ముందుగా ఈ పేరును వెల్లడిస్తూ ఆర్జేడీ ట్వీట్‌ చేయగా.. కాసేపటికే దానిని డిలిట్ చేసింది.

I - ఇండియా, N - నేషనల్, D - డెమొక్రాటిక్, I - ఇంక్లూజివ్, A - అలయెన్స్ (INDIA)గా నూతన కూటమికి పేరు పెట్టారు. బెంగళూరులో నిన్న, ఇవాళ ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, జేడీయూ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ, అప్నాదళ్ (కే), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్‌పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎండీఎంకే, వీసీకే, కేఎండీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), కేరళ కాంగ్రెస్ (జోసఫ్) పార్టీలు పాల్గొన్నాయి.












Updated : 18 July 2023 4:03 PM IST
Tags:    
Next Story
Share it
Top