Home > జాతీయం > అందుకే వాళ్ళు ఓటింగ్ కు ముందే వాకౌట్ చేశారు

అందుకే వాళ్ళు ఓటింగ్ కు ముందే వాకౌట్ చేశారు

అందుకే వాళ్ళు ఓటింగ్ కు ముందే వాకౌట్ చేశారు
X

కేంద్రం మీద విపక్షాలు పెట్టిన తీర్మానం వీగిపోయింది. వాళ్ళు వాకౌట్ చేయడంతో అసలు ఓటింగే జరగలేదు. ఇండియా కూటమిలో చీలికలు బయటపడతాయనే విపక్షాలు ఓటింగ్ కు ముందే బయటకు వెళ్ళిపోయారని మండిప్డడారు ప్రధాని నేరంద్రమోదీ. పశ్చిమ బెంగాల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈరోజు వర్చువల్ గా ప్రసంగించారు.

పార్లమెంటులో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని దిగ్విజయంగా ఓడించాం. వాటితో పాటూ తమ ప్రతికూలతలను కూడా అన్నారు మోదీ. విపక్షాలు ఓడిపోతామనే భయంతోనే సభ నుంచి జారుకున్నారని విమర్శించారు. మణిపూర్ అంశాన్ని రాజకీయం చేయాలనుకున్నారు కానీ వారి ఎత్తు పారలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గరీబీ హఠావో అని నినాదాలు చేసే కాంగ్రెస్ దని కోసం ఏం చేసిందో చెప్పాలని అడిగారు మోదీ. కానీ పేదల సమగ్రాభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని వివరించారు. కొన్ని రోజుల క్రితం జరిగిన పంచాయితీ ఎన్నికల్లో బెంగాల్ లోని ప్రతిపక్షాలను భయపెట్టేందుకు అధికార టీఎంసీ హింస, బెదిరింపులను ఆయుధాలుగా వాడుకుందని మోదీ ఆరోపించారు. బీజెపీ అభ్యర్ధుల విజయోత్సవ ర్యాలీ మీద దాడులు చేయించారని మండిపడ్డారు.



Updated : 12 Aug 2023 3:06 PM IST
Tags:    
Next Story
Share it
Top