Home > జాతీయం > మహారాష్ట్రలో మృత్యుఘోష.. 48 గంటల్లో 49 మంది మృతి..

మహారాష్ట్రలో మృత్యుఘోష.. 48 గంటల్లో 49 మంది మృతి..

మహారాష్ట్రలో మృత్యుఘోష.. 48 గంటల్లో 49 మంది మృతి..
X

మహారాష్ట్రలోని ప్రభుత్వాసుపత్రుల్లో మృత్యుఘోష ఆగడం లేదు. గత 48గంటల్లో 49మరణాలు చోటుచేసుకున్నాయి. నాందేడ్‌, ఔరంగాబాద్‌ ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. నాందేడ్లో నిన్న ఒక్కరోజే 12 మంది నవజాత శిశువులు సహా 24 మంది చనిపోగా తాజాగా మరో ఏడుగురు చనిపోయారు. మరణించిన 12 మంది నవజాత శిశువుల్లో ఆరుగురు బాలికలు కాగా ఆరుగురు బాలురు ఉన్నారు. ఛత్రపతి శంభాజీనగర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో 24 గంటల వ్యవధిలో 18 మందికిపైగా రోగులు మృత్యువాత పడ్డారు. ఇందులో ఇద్దరు శిశివులు ఉన్నారు.

ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందకపోవడంతోనే మరణాలు సంభవిస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రోగులకు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యం నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని.. విధుల్లో ఆలసత్వం వహించిన వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే డిమాండ్ చేశారు.. బీజేపీ నేతృత్వంలోని ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కారే ఈ మరణాలకు బాధ్యత వహించాలని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ విమర్శించారు.


Updated : 4 Oct 2023 6:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top