Home > జాతీయం > బీహార్లో విపక్షాల సమావేశం.. 15పార్టీల నేతల హాజరు

బీహార్లో విపక్షాల సమావేశం.. 15పార్టీల నేతల హాజరు

బీహార్లో విపక్షాల సమావేశం.. 15పార్టీల నేతల హాజరు
X

బీహార్లో విపక్ష పార్టీల ఐక్యత సమావేశం కొనసాగుతోంది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి 15 పార్టీల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్, శరద్ పవార్, స్టాలిన్, లాలూ ప్రసాద్ యాదవ్ సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు, ఎన్డీఏను ఎదుర్కొనేందుకు ప్రధాన ఫ్రంట్ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఈ సమావేశానికి ముందు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో సిద్ధాంతపరమైన ఘర్షణ జరుగుతోందన్నారు. కాంగ్రెస్ ‘‘భారత్‌ జోడో.. ఆర్ఎస్‌ఎస్‌, బీజేపీ ‘భారత్‌ టోడో’ సిద్ధాంతానికి మధ్య యుద్ధం నడుస్తోంది. భారత్‌ను విచ్ఛిన్నం చేసేందుకు విద్వేషం, హింసను వ్యాప్తి చేసేందుకు బీజేపీ యత్నిస్తోంది. కానీ మేం దానిని కట్టడిచేసేందుకు కృషి చేస్తున్నాం. అందుకోసమే విపక్ష పార్టీలన్నీ బిహార్ వచ్చాయి. మేమంతా కలిసి బీజేపీని ఓడిస్తాం’’ అని రాహుల్ అన్నారు.

కాంగ్రెస్ సామాన్యుడి వెన్నంట నిలిస్తే బీజేపీ మాత్రం కేవ‌లం ఇద్ద‌రు ముగ్గురు అత్యంత సంప‌న్నులు, బ‌డా పారిశ్రామికవేత్త‌లకే మేలు చేస్తోంద‌ని మండిప‌డ్డారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్దాన్‌, చ‌త్తీస్‌ఘ‌ఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధిస్తుంద‌ని, బీజేపీ త‌మ ద‌రిదాపుల్లోకి రాద‌ని రాహుల్ గాంధీ ధీమా వ్య‌క్తం చేశారు.

Updated : 23 Jun 2023 1:51 PM IST
Tags:    
Next Story
Share it
Top