Home > జాతీయం > తండ్రీ కొడుకుల్ని కలిపిన అన్నదానం

తండ్రీ కొడుకుల్ని కలిపిన అన్నదానం

తండ్రీ కొడుకుల్ని కలిపిన అన్నదానం
X

తల్లి అనుమానాస్పద రీతిలో చనిపోయింది. తండ్రి జైలుకెళ్లాడు. మూడేళ్ల వయసులో ఆ బాలుడు అనాథగా మారాడు. అధికారుల చొరవతో ఓ అనాథాశ్రమానికి చేరాడు. పదేళ్లు గడిచాయి. అమ్మానాన్నల జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్న ఆ బాలుడి జీవితంలో ఓ రోజు అనుకోని ఘటన జరిగింది. అన్నదాన కార్యక్రమంలో హఠాత్తుగా తండ్రి కనిపించాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

మూడేళ్ల వయసులో

ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని రామ్‌గఢ్‌ పట్టణానికి చెందిన టింకు వర్మకు భార్య, కుమారుడితో జీవనం కొనసాగించేవాడు. పదేళ్ల క్రితం కొడుకు శివం మూడేళ్ల పిల్లాడిగా ఉండగా.. అతని తల్లి అనుమానాస్పద రీతిలో చనిపోయింది. భర్త టింకుపై అనుమానంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపించారు. తల్లి మరణం, తండ్రి జైలుపాలవడంతో అనాథగా మారిన శివంను అధికారులు ఓ ఆశ్రమంలో చేర్పించారు.

అన్నదానంలో పాల్గొంటుండగా

శిక్షపూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలైన టింకు వర్మ జైలు నుంచి విడుదలయ్యాడు. బయటకు వచ్చాక కొడుకు ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో ఆటో నడుపుకుంటూ ఒంటరిగా బతుకుతున్నాడు. మరోవైపు శివం 8వ తరగతికి వచ్చాడు. తల్లిదండ్రుల జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్న ఆ బాలుడి జీవితంలో ఊహించని ఘటన జరిగింది. శివం ఉంటున్న ఓంకార్ మిషన్ శుక్రవారం మధ్యాహ్నం పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే శివం ఎప్పటిలాగే అందరికీ వడ్డిస్తూ వచ్చాడు. ఇంతలో ఓ వ్యక్తిని చూసి ఆగిపోయాడు. తన దగ్గర ఉన్న ఫొటోలో తండ్రి రూపం అదేనని గ్రహించాడు. ఇదే విషయాన్ని టింకు వర్మకు చెప్పగా అతను కూడా కొడుకును గుర్తుపట్టారు. తండ్రీ కొడుకులిద్దరూ ఒకరినొకరు హత్తుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.

త్వరలో తండ్రి చెంతకు కొడుకు

పదేళ్ల తర్వాత కలుసుకున్న ఆ తండ్రీ కొడుకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వారిని చూసి అనాథాశ్రమ సిబ్బంది సైతం సంతోషం వ్యక్తం చేశారు. తాను జీవితంలో మళ్లీ తండ్రిని కలుస్తానని అనుకోలేదని, దేవుడి దయవల్ల అది సాధ్యమైందని శివం చెప్పాడు. మరోవైపు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తైన తర్వాత శివంను అతని తండ్రి టింకూ వర్మకు అప్పజెపుతామని ఆశ్రమ నిర్వాహకులు చెప్పారు.

Updated : 5 Jun 2023 8:37 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top