Home > జాతీయం > దేశవ్యాప్తంగా.. మూడేళ్లలో 13లక్షల మహిళలు మిస్సింగ్‌

దేశవ్యాప్తంగా.. మూడేళ్లలో 13లక్షల మహిళలు మిస్సింగ్‌

దేశవ్యాప్తంగా.. మూడేళ్లలో 13లక్షల మహిళలు మిస్సింగ్‌
X

దేశవ్యాప్తంగా మూడేళ్లలో 13లక్షలకు పైగా అమ్మాయిలు, మహిళలు (Women Missing) అదృశ్యమైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో మధ్యప్రదేశ్‌ నుంచి అత్యధికంగా సుమారు 2 లక్షల మంది ఉన్నారని, ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్‌ ఉందని పేర్కొంది. 2019 నుంచి 2021 వరకు మూడేళ్ల కాలంలో తప్పిపోయిన మహిళల సంఖ్య గురించి నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నమోదు చేసిన గణాంకాలను గత వారం పార్లమెంట్‌లో కేంద్ర హోం శాఖ వెల్లడించింది. మిస్సయిన మొత్తం 13.13 లక్షల మందిలో బాలికలు 2,51,430 మంది కాగా, 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 10,61,648 అని వివరించింది.

నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం, మధ్యప్రదేశ్‌లో మూడేళ్ల కాలంలో 1,60,180 లక్షల మహిళలు, 38,234 మంది బాలికలు అదృశ్యమయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోనూ 1,56,905 మంది మహిళలు, 36,606 మంది బాలికలు తప్పిపోయారు. మహారాష్ట్రలో 1,78,400 మంది మహిళలు, 13,033 మంది అమ్మాయిల ఆచూకీ లేకుండా పోయినట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. ఒడిశాలో 70,222 మంది మహిళలు, 16,649 మంది బాలికలు అదృశ్యమైనట్లు తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతాల విషయానికొస్తే.. దిల్లీలో అత్యధికంగా ఈ మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 61,054 మంది స్త్రీలు, 22,919 మంది బాలికలు తప్పిపోయారు. జమ్మూ కశ్మీర్‌లో 8617 మంది మహిళలు, 1148 మంది బాలికలు అదృశ్యమైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్లలో 72,767 మంది అదృశ్యం కాగా వీరిలో 56,773 మంది మహిళలు, 15,994 బాలికలు ఉన్నారు.

Updated : 31 July 2023 3:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top