Home > జాతీయం > తైవాన్ దేశస్థుడికి పద్మభూషణ్..ఇండియాలో విశేష సేవలు

తైవాన్ దేశస్థుడికి పద్మభూషణ్..ఇండియాలో విశేష సేవలు

తైవాన్ దేశస్థుడికి పద్మభూషణ్..ఇండియాలో విశేష సేవలు
X

అంతర్జాతీయ సెమీకండక్టర్ల తయారీ సంస్థ ఫాక్సాకాన్ సీఈవో 66 ఏళ్ల యంగ్ లీయూకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. ఇండియా పారిశ్రామిక రంగంలో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. మొత్తంగా విదేశీయులు, ఎన్నారైల కేటగిరీలో 8 మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. చైనా తమదిగా చెప్పుకొనే తైవాన్ కి చెందిన వ్యక్తికి ఈ పురస్కారం ఇవ్వడం ద్వారా ఆ దేశ స్వాతంత్ర్యానికి మద్దతిచ్చినట్లు అవుతుందని విదేశాంగ నిపుణులు వెల్లడించారు. మరోవైపు భారత్ లో సెమీకండక్టర్ల పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల విషయంలో ఈ పురస్కారం లాభం చేకూరుస్తుందని తెలిపారు. కోవిడ్ తర్వాత చైనా నుంచి తమ పెట్టుబడుల్ని మరల్చేందుకు భారత్‌లో విస్తృతంగా పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకల్లో తమ ప్లాంట్లు నెలకొల్పింది. మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన ప్రముఖ ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌కు అతిపెద్ద సప్లయిర్ గా ఉంది ఫాక్స్‌కాన్. ఈ నేపథ్యంలోనే భారత్‌లో సేవలు విస్తరిస్తున్నందుకు గానూ యాంగ్‌కు భారత్‌లోనే మూడో అతిపెద్ద పౌర పురస్కారం లభించడం విశేషం.




Updated : 26 Jan 2024 10:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top