Home > జాతీయం > ఇమ్రాన్ ఖాన్కు రిలీఫ్.. తోషఖానా కేసులో శిక్ష నిలిపివేత..

ఇమ్రాన్ ఖాన్కు రిలీఫ్.. తోషఖానా కేసులో శిక్ష నిలిపివేత..

ఇమ్రాన్ ఖాన్కు రిలీఫ్.. తోషఖానా కేసులో శిక్ష నిలిపివేత..
X

అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు రిలీఫ్ దొరికింది. తోషఖానా కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేండ్ల జైలు శిక్షను నిలిపేస్తూ ఇస్లామాబాద్ కోర్టు తీర్పు చెప్పింది. తోషాఖానా కరప్షన్ కేసులో తనకు పడ్డ శిక్ష రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన హైకోర్టు సోమవారం తీర్పు రిజర్వ్‌ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమీర్‌ ఫారూఖ్‌, జస్టిస్‌ తారీఖ్‌ మహ్మద్‌ జహంగిరిలతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది.

2018 నుండి 2022 వరకు పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అక్రమంగా దేశ సంపదను అమ్ముకున్నారన్న నేరం రుజువుకావడంతో కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. దీంతో పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అటక్‌ జిల్లా జైలులో ఇమ్రాన్ శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే కేసులో మరో ఐదేళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పాల్గొనడానికి కూడా వీల్లేదని తెలుపుతూ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. ఇస్లామాబాద్ హైకోర్టు ఆ తీర్పును నిలిపివేయడంతో ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం లభించింది.




Updated : 29 Aug 2023 10:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top