Home > జాతీయం > గంటపాటూ భారత్ లో తిరుగాడిన పాకిస్తాన్ విమానం

గంటపాటూ భారత్ లో తిరుగాడిన పాకిస్తాన్ విమానం

గంటపాటూ భారత్ లో తిరుగాడిన పాకిస్తాన్ విమానం
X

భారత్ లోకి వచ్చేసిన విమానం కాస్సేపు హడావుడి చేసింది. గంటకు పైగా భారత గగనతలంలో తిరిగింది. రాజస్థాన్ సహా మూడు రాష్ట్రాల్లో ఆకాశం మీద తిరుగాడింది.

నిన్న సాయంత్రం నాలుగున్నర టైమ్ లో పాకిస్తాన్ ప్యాసింజర్ విమానం కరాచీ నుంచి ఇస్లామాబాద్ బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో అది కాస్తా ట్రాక్ తప్పింది. అది అలా దారి మారిపోయి భారత్ లోకి వచ్చేసింది. ముందు రాజస్థాన్ సరిహద్దులోకి ప్రవేశించింది. అక్కడి నుంచి హర్యానా, పంజాబ్ మీదుగా సుమారు 1 గంట 12 నిమిషాల పాటూ భారత గగనతలంలోనే తిరుగుతూ ఉంది. పంజాబ్ నుంచి మళ్ళీ పాకిస్తాన్ కి వెళ్ళిపోయింది.

భారత సరిహద్దుల్లోకి వచ్చిన విమానం గురించి భారత వైమానికదళం, అధికారులకు తెలిసింది. అయితే అది ప్రయాణికులతో కూడిన విమానం కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించనప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందని వైమానికి అధికారులు చెబుతున్నారు. దారితప్పిపోయి...సురక్షితమైన మార్గాలు కోసం వస్తాయి. గతంలో భారత విమానాలకు కూడా ఇలా జరిగిందని చెబుతున్నారు. అమ్మదాబాద్ నుంచి అమృత్ సర్ వెళ్తున్న విమానం దాదాపు అరగంట పాటూ పాకిస్తాన్ సరిహద్దుల్లో తిరిగింది. భారత్ లో లానే పాకిస్తాన్ లో కూడా వర్షాలు దారుణంగా కురుస్తున్నాయి. అందుకే ఇలా జరిగిందని తెలిపారు.

Updated : 29 July 2023 9:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top