రాష్ట్రపతి భవన్‌పై దాడికి ఐసిస్ కుట్ర.. !!
పాక్ మహిళకు ఫోటోలు పంపిన బీహార్ వ్యక్తి!
X
జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం దేశ రాజధాని న్యూఢిల్లీ నగరం సకల ఏర్పాట్లతో సిద్ధమైంది. అగ్రరాజ్యాధినేతలు సహా 40కి పైగా దేశాల అధినేతలు, వివిధ ప్రపంచస్థాయి సంస్థల అధిపతులు ఈరోజు, రేపు(సెప్టెంబరు 9, 10 తేదీల్లో)జరగబోయే సదస్సుకు హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రపతి భవన్, నేషనల్ వార్ మెమోరియల్ సహా పలు ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అప్రమత్తమై రక్షణ చర్యలను పటిష్ఠం చేశారు. బిహార్‌కు చెందిన బన్సీ ఝా అనే వ్యక్తి.. పాకిస్థాన్‌కు గూడఛారిగా వ్యవహరిస్తున్నాడని కోల్‌కతా పోలీసులకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) డిటెక్టివ్లు.. బిహార్‌కు వెళ్లి అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా అతడి నుంచి మరింత సమాచారం తెలుసుకున్నారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించిన STF డిటెక్టివ్లు.. అనేక చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆ వ్యక్తి కోల్‌కతాకు వచ్చి బాలి వంతెనతో పాటు అక్కడే ఉన్న మరో ఆలయానికి చెందిన ఫోటోలను, అలాగే.. ఢిల్లీ, చెన్నైలోని ప్రముఖ ప్రాంతాలకు చెందిన ఫోటోలను పాకిస్థాన్‌లోని ఓ మహిళకు పంపినట్లు డిటెక్టివ్లు ఆరోపించారు. ఆ చిత్రాల్లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌తో పాటు నేషనల్ వార్ మెమోరియల్ చిత్రాలు కూడా ఉన్నట్లు చెప్పారు. సదరు మహిళ.. పాకిస్థాన్ ఇంటిలిజెన్స్‌లో పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. దేశంలో పలు ముఖ్యమైన ప్రదేశాలను.. ఐసిస్ ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు.