Home > జాతీయం > పాన్ – ఆధార్ లింక్‌కు ఇంకో చాన్స్.. షరతులు వర్తిస్తాయ్..

పాన్ – ఆధార్ లింక్‌కు ఇంకో చాన్స్.. షరతులు వర్తిస్తాయ్..

పాన్ – ఆధార్ లింక్‌కు ఇంకో చాన్స్.. షరతులు వర్తిస్తాయ్..
X

పాన్, ఆధార్ కార్డుల అనుసంధానానికి జూన్ 30తో గడువు ముగిసింది. అయితే చాలా మంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. కొంతమందికి విషయం తెలియకపోవడం ఒక కారణమైతే, సాంతకేతిక కారణాల వల్ల మరికొందరికి లింక్ కాలేదు. దీంతో పాన్ కార్డు నిరుపయోగంగా మారాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రూ. 1000 పెనాల్టీతో రెండు కార్డులను లింక్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే లింకు పూర్తయిన నెల రోజుల తర్వాతే పాన్ కార్డు చెల్లుబాటులో వస్తుందని, ఆ లోపు దేనికీ పనికాదని తెలిపింది. జూన్ 30 లోపల లింక్ చేసుకున్నవారు కూడా వెయ్యి పెనాల్టీ కట్టడం తెలిసిందే. అదే మొత్తంతో మళ్లీ లింకింగ్‌కు అవకాశం కల్పించారు. అయితే ఈ అవకాశం ఎంతవరకన్నది స్పష్టంగా వెల్లడించలేదు.

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపిన వివరాల ప్రకారం... వెయ్యి పెనాల్టీతో లింకింగ్‌కు ఇప్పటికీ అవకాశం ఉంది. ఉదాహరణకు జులై 10న పాన్, ఆధార్ లింక్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆగస్ట్ 9న పాన్‌ కార్డును పునరుద్ధరిస్తారు. ఆధార్, పాన్ లిక్ కాకపోతే ఎక్కువ పన్ను చెల్లించాల్సి రావడంతో పాటు చాలా సమస్యలు వస్తాయని ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాసార్లు లింకింగ్ గడువు పెంచినప్పటికీ దేశవ్యాప్తంగా లింక్ కాని కేసుల లక్షల్లోనే ఉన్నట్లు అంచనా. వీరికి రూ. 1000 పెనాల్టీతో లింక్ చేసుకునే అవకాశం ఎన్నాళ్లన్నది స్పష్టంగా తెలియకపోవడంతో గందరగోళం నెలకొంది. పెనాల్టీ అవకాశంతో పాన్‌ను ఎప్పడైనా పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుందని, అయితే దరఖాస్తు తర్వాత నెల రోజుల వరకు నిరుపయోగంగా ఉంటుందని భావించాలి.

Updated : 3 July 2023 8:09 PM IST
Tags:    
Next Story
Share it
Top