ఉదయ నిధి తల నరికితే రూ.10 కోట్లు ఇస్తా!
X
తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మం నశించాలి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని అన్న మాటలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దేశంలోని హిందూ సంఘాలు, ధార్మిక సంస్థలు ఉదయ నిధిపై దుమ్మెత్తి పోస్తున్నాయి. అంతేకాకుండా ఈ సమస్య మాటల నుంచి వార్నింగ్ ల వరకు వెళ్లింది. సోమవారం (సెప్టెంబర్ 4) అయోధ్యకు చెందిన పరమహంస ఆచార్య ఉదయ నిధిని ఉద్దేశిస్తూ సంచలన ప్రకటన చేశారు. ఉదయ నిధి తల నరికి తీసుకొచ్చిన వాళ్లకు రూ.10 కోట్ల డబ్బులిస్తానని బహిరంగంగా ప్రకటించారు. అంతేకాకుండా బహిరంగంగా ఫొటోను తల్వార్ తో పొడుస్తూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా మాట్లాడిన పరమహంస ఆచార్య.. సనాతన ధర్మానికి లక్షల సంవత్సరాల నుంచి మూలాలు ఉన్నాయని అన్నారు. మిలియన్ ఏళ్లనుంచి ఉనికిలో ఉందని, 2 వేల ఏళ్ల క్రితం నుంచే కొన్ని మతాలు ఉనికిలోకి వచ్చాయని తెలిపారు. మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఒకే మతం ఉండేదని, అది సనాతన ధర్మమని చెప్పారు. ధర్మాన్ని నాశనం చేయాలని అనుకున్నవాళ్లే నాశనం అయి పోతారని హెచ్చరించారు.
अयोध्या के तपस्वी छावनी पीठाधीश्वर जगतगुरु परमहंस आचार्य ने उदयनिधि स्टालिन का सिर कलम करने वाले को 10 करोड़ का इनाम देने की घोषणा की।#UdayanidhiStalin #UdaynidhiStalin #SanatanaDharma #Sanatan pic.twitter.com/rY76qcTCNY
— SATENDRA SHARMA (@SatendraLive) September 4, 2023