Home > జాతీయం > ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్.. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్

ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్.. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్

ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్.. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్
X

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జనవరి 31న పార్ల‌మెంట్ ఉభ‌యస‌భ‌ల‌ను ఉద్దేశించి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌సంగించనున్నారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ ప్రధాని మోడీ సర్కారుకు చివరిది కానుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మేలో కొత్త సర్కారు కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం మోడీ సర్కారు మధ్యంతర బడ్జెట్ సభ ముందు ఉంచనున్నారు. అయితే ఈ బడ్జెట్లోప్రభుత్వం కీలక ప్రకటనలేవీ చేయవు. అయితే ఈసారి మధ్యంతర బడ్జెట్లో మహిళా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే నగదు సాయాన్ని రెట్టింపు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 12వేల కోట్ల ఆర్థికభారం పడనుంది.

గతేడాది బడ్జెట్ సమావేశాలను రెండు దఫాలుగా నిర్వహించారు. తొలి విడతలో బడ్జెట్ ప్రవేశపెట్టగా.. రెండో విడత సమావేశాల్లో బడ్జెట్ పై చర్చించి ఆమోదించారు. ఇదిలా ఉంటే ఈసారి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముంది.

Updated : 11 Jan 2024 8:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top