OLD Parliament session పార్లమెంట్ పాత భవనం ముందు ఎంపీల గ్రూప్ ఫోటో
X
ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య కొత్త భవనంలో నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త భవనం ఇకపై పార్లమెంటుగా (Indian Parliament) సేవలు అందిచనుంది. ఈమేరకు కొత్తగా నిర్మించిన భవనాన్ని పార్లమెంట్‌గా (Parliament) నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ (Gazette) విడుదల చేసింది. నేటి నుంచి కొత్త భవనంలో సభా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్‌సభ, 2.15 గంటలకు రాజ్యసభ ప్రారంభమవుతాయి
పార్లమెంటు ఐదు రోజుల ప్రత్యేక సెషన్‌లో భాగంగా రెండవ రోజైన నేడు.. కొత్త పార్లమెంటు భవనంలోకి ఎంపీలు అధికారికంగా అడుగుపెట్టనున్నారు. పార్లమెంటరీ కార్యకలాపాలు పాత భవనం నుంచి అత్యాధునిక కొత్త భవనంలోకి మారుతాయి. గణేష్ చతుర్థి సందర్భంగా కొత్త భవనంలోకి మారుతున్నట్లు .. ఇది కొత్త ప్రారంభానికి సాంప్రదాయకంగా శుభ సందర్భమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తొలి రోజైన సోమవారం పార్లమెంట్ సభ్యులంతా పాత పార్లమెంట్ భవనంలో సమావేశమై అక్కడి అనుభవాలను నెమరువేసుకున్నారు. పాత పార్లమెంట్ భవనంలోని ప్రతి ఇటుకకు నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఇది రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇక నేటి పార్లమెంట్ సమావేశాలకు ముందు.. పార్లమెంట్ సభ్యులంతా(ఎంపీలంతా).. పాత భవనం ఆవరణలో గ్రూఫ్ ఫొటోలు దిగారు.
పాత పార్లమెంటు భవనం ప్రాంగణంలో మూడు వేర్వేరు గ్రూప్ ఫొటోలు తీసుకున్నారు. మొదటిది రాజ్యసభ, లోక్‌సభ సభ్యులది కలిపి కాగా.. రెండు, మూడోది సభలవారీగా వేర్వేరుగా దిగారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీ నరహరి అమీన్ స్పృహతప్పి పడిపోయారు. కాసేపటి తర్వాత కోలుకుని.. ఫొటో సెషన్‌లో భాగమయ్యారు. ఈీ ఫోటోల్లో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్రమోదీ(Modi), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తదితరులు ముందు వరుసలో కూర్చున్నారు.