Home > జాతీయం > నదిలో దూకి ప్రాణాలు కాపాడుకున్న రైలు ప్రయాణికులు

నదిలో దూకి ప్రాణాలు కాపాడుకున్న రైలు ప్రయాణికులు

ప్రాణాలకు తెగించి.. ప్రాణాలు దక్కించుకున్నారు

నదిలో దూకి ప్రాణాలు కాపాడుకున్న రైలు ప్రయాణికులు
X


ఒడిషా రైలు ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా ఎంతోమందిని షాక్‌కు గురి చేసింది. రైలులో ప్రయాణించాలంటే అప్రమత్తత తప్పనిసరి అని భావించారు. ఈ క్రమంలోనే కొంతమంది ప్రయాణికులు తమ ప్రయాణిస్తున్న రైలులో ఒక్కసారిగా పొగ కమ్ముకోవడంతో అలర్ట్ అయ్యారు. ప్రమాదం జరగబోతుందని భావించి వెంటనే చైన్​ లాగడంతో.. ఆ రైలు కాస్త సరిగ్గా ఓ నది వంతెనపై ఆగింది. ప్రయాణికుల్లో కొందరు తమ ప్రాణాలు కాపాడుకునేందు.. వంతెన అంచున నడిచి బయటకు వచ్చారు. మరికొందరు నదిలోకి దూకినట్లు సమాచారం. ఉత్తరాఖండ్​.. హరిద్వార్​ జిల్లాలో ఇదీ జరిగింది.

ఆదివారం లఖ్​నవూ నుంచి చండీగఢ్ వెళ్తున్న సద్భావనా ​​ఎక్స్‌ప్రెస్ బ్రేక్​లు జామ్​ అయి పొగ వచ్చింది. రైల్లో మంటలు అంటుకున్నట్లు భావించిన ప్రయాణికులు చైన్​ లాగారు. దీంతో రైలు లక్సర్ ప్రాంతంలోని రైసీ రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే బాణ్​గంగా నదిపై ఆగింది. వెంటనే ప్రయాణికుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. అదే సమయంలో బాణ్​గంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయినా ప్రయాణికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వంతెన అంచు నుంచి నడుచుకుని ముందుకు వెళ్లారు. కొంతమంది తమ ప్రాణాలను కాపాడుకోడానికి నదిలోకి దూకినట్లు అక్కడున్న కొందరు చెప్పారు. దీన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బ్రేకులను పునరుద్ధరించారు. అనంతరం రైలు బయలుదేరింది. ఈ ఘటనపై మొరాదాబాద్​ డివిజనల్​ రైల్వే మేనేజర్​ మాట్లాడుతూ.. 'రైలు బ్రేక్ బ్లాక్ అయింది. లక్సర్ వద్ద చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది. ప్రయాణికుల అసౌకర్యాన్ని అర్థం చేసుకొని, రైలు బ్రేక్ ను బాగుపరచడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అసౌకర్యానికి చింతిస్తున్నాము' అని ట్వీట్​ చేశారు.


Updated : 24 July 2023 9:49 AM IST
Tags:    
Next Story
Share it
Top