Home > జాతీయం > జనాలేంటి మరీ ఇంత వైలెంట్ గా మారిపోతున్నారు...

జనాలేంటి మరీ ఇంత వైలెంట్ గా మారిపోతున్నారు...

జనాలేంటి మరీ ఇంత వైలెంట్ గా మారిపోతున్నారు...
X

ట్రైన్ లో కరెంట్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రయాణికులు గాలి, లైట్ లేక చాలా ఇబ్బందులు పడతారు. కానీ దానికీ...టీటీఈ కి ఏం సంబంధం ఉండదు. టీటీఈ అంటే కేవలం టికెట్ కలెక్టర్ అంతే. అతను కోచ్, బెర్త్ లు, రిజర్వేషన్లు ఇలాంటి వాటిని చూసుకుంటాడు. కానీ ట్రైన్ లో బోగీలకు కరెంట్ లేకపోవడం ఓ టీటీఈకి శాపంలా మారింది. జనాలు అతని మీద పడి మరీ టాలెట్ లో బంధించేశారు.





ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి ఘాజీపూర్ బయలుదేరిన సుహైల్ దేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో టెక్నికల్ ప్రాబ్లెమ్స్ కారణంగా బీ1, బి2 బోగీల్లో విద్యుత్ సరఫరా కాలేదు. దీంతో వాటిల్లో ఉన్న ఏసీలు పనిచేయలేదు. దీనివలన అందులోని ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కరెక్ట్ గా అదే టైమ్ కి టికెట్స్ చెక్ చేయడానికి టీటీఈ వచ్చారు. అంతే ఒక్కసారిగా జనాలు అతని మీద పడ్డారు. కరెంట్ ఎందుకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా అతణ్ణి ట్రైన్ టాయిలెట్ లో పెట్టి తలుపులు మూసేశారు.

టీటీఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులకు, అధికారులకు సమాచారం ఇవ్వడంతో అతను బయటపడ్డారు. వారు ప్రయాణికులను సముదాయించి టీటీఈని బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత టెక్నికల్ ఇంజనీర్లు విద్యుత్ సమస్యను కూడా పరిష్కరించడంతో చల్లబడ్డారు. ఈ మొత్తం ఇన్సిడెంట్ ను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగి పట్ల అలా ప్రవర్తించడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Updated : 12 Aug 2023 6:38 PM IST
Tags:    
Next Story
Share it
Top