Home > జాతీయం > లాకప్ డెత్.. పోలీస్ కస్టడీలో వ్యక్తి హత్య

లాకప్ డెత్.. పోలీస్ కస్టడీలో వ్యక్తి హత్య

లాకప్ డెత్.. పోలీస్ కస్టడీలో వ్యక్తి హత్య
X

కస్టడీలో మరణించిన బాధితుడి భార్యకు 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని జార్ఖండ్ హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన మృతికి కారణమైన పోలీసు సిబ్బందిపై విచారణకు కూడా ఆదేశించింది. 2015 జూన్‌లో ధన్‌బాద్‌లో తన భర్త ఉమేష్ సింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు చిత్రహింసలు పెట్టారని పిటిషనర్, బబితా దేవి ఆరోపించారు. ఉమేష్ శరీరంపై అనేక గాయాలు ఉన్నాయని తెలిపింది. అతను పోలీసు కస్టడీలో చనిపోయాడని గుర్తించడంతో హైకోర్టును ఆశ్రయించింది.

ఆమె భర్తను ఆ రోజు ఉదయం విడుదల చేస్తామని బబితాదేవికి పోలీసులు సమాచారం అందించారు. ఆ తర్వాత ఆమె పీఎస్ చేరుకునేసరికే అక్కడ సమీపంలోనే ఉమేష్ అనేక గాయాలతో , లోదుస్తులు తప్ప బట్టలు లేకుండా కనిపించాడు. అతను చనిపోయినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఉమేష్ సింగ్ చొక్కాను గుర్తించిన బబితా దేవి.. కోర్టును ఆశ్రయించింది. దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును సిఐడికి అప్పగించింది. పోలీసులు కొట్టడంతోనే ఉమేష్ మృతి చెందాడంటూ మృతుడి భార్య హై కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన హైకోర్టు, ఇది కస్టడీ మరణానికి ఉదాహరణగా గుర్తించింది. దీంతో మృతుడి భార్యకు రూ. 5 లక్షల పరిహారాన్ని 6 వారాల్లోగా విడుదల చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.




Updated : 7 July 2023 9:50 AM IST
Tags:    
Next Story
Share it
Top