Home > జాతీయం > Assembly Election 2023 : రాజస్థాన్లో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసేందుకు క్యూ కట్టిన జనం..

Assembly Election 2023 : రాజస్థాన్లో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసేందుకు క్యూ కట్టిన జనం..

Assembly Election 2023 : రాజస్థాన్లో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసేందుకు క్యూ కట్టిన జనం..
X

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ రాజస్థాన్ లో ఓటింగ్ జరుగుతోంది. ఆ రాష్ట్రంలో మొత్తం 200 నియోజకవర్గాలు ఉండగా.. 199 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. కరన్‌పూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే గుర్మీత్‌ సింగ్‌ కూనార్‌ ఆకస్మిక మరణంతో అక్కడ ఎన్నిక వాయిదాపడింది. మిగతా చోట్ల ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

199 సీట్లకు జరుగుతున్న ఎన్నికలో మొత్తం 5.25 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 1.71 కోట్ల మంది 18 నుంచి 30 ఏండ్ల వయస్సు ఓటర్లు కావడం విశేషం. ఈ సారి కొత్తగా 22.61 లక్షల మంది మొదటిసారి ఓటు వేస్తున్నారు. వారంతా 1862 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. బీజేపీ నుంచి 59, కాంగ్రెస్‌ పార్టీ 97 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మళ్లీ బరిలో దింపింది. ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి.




Updated : 25 Nov 2023 8:53 AM IST
Tags:    
Next Story
Share it
Top