Propose Day : కాస్ట్లీ గిఫ్టులు.. ఖరీదైన రెస్టారెంట్లు కాదు.. ప్రపోజ్ చేసేందుకు కావాల్సినవి ఇవే..
X
ప్రేమ.. రెండక్షరాల పదం. కానీ దానికున్న శక్తి అనంతం. ప్రేమ ఎప్పుడు ఎలా ఎవరిపై పుడుతుందో చెప్పలేం. అలా పుట్టిన ప్రేమను మనసులో దాచుకోవడం చాలా కష్టం. నచ్చిన వారి ముందు ప్రేమను వ్యక్తపరచడం అంత ఈజీ కాదు. మనసులో ఉన్న మాటలు బయటపెట్టేందుకు అంతర్లీనంగా పెద్ద యుద్ధమే జరుగుతుంది. చివరకు మనసులో మాట చెప్పే సమయంలో చాలా మంది ఎలా చెప్పాలో అర్థంకాక సతమతమవుతుంటారు. అందుకే లవ్ ప్రపోజ్ చేయాలనుకునే వారు ఇవి తప్పకుండా పాటించాలని అంటున్నారు లవ్ గురూలు.
లవ్ ప్రపోజ్ చేసేవారు సూటిగా సుత్తిలేకుండా చెప్పడం కంపల్సరీ . ఏం చెప్పాలనుకుంటున్నారో ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పండి. ఇంప్రెస్ చేసేందుకు ఆర్భాటపు మాటలు చెప్పి భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా నిజాలే చెప్పండి. చాలా మంది అందం చూసి ప్రేమలో పడతారు. కానీ అది ప్రేమకాదు ఆకర్షణ. అలా కాకుండా మీరు ఎందుకు ప్రేమిస్తున్నారో, ఏ క్వాలిటీ నచ్చిందో, ప్యూచర్ ప్లాన్స్ ఏంటో ముందుగానే నిర్ణయించుకోండి. ప్రపోజ్ చేసే సమయంలో అవే చెప్పేయండి. మీరు మీ అభిప్రాయాలు, ప్యూచర్ ప్లాన్స్ గురించి ఎంత నిజాయితీగా చెప్తే ఎదుటి వారి నమ్మకాన్ని అంతగా గెలుచుకుంటారు.
ప్రపోజ్ చేయాలనుకునేవారు అనవసరపు ఆర్బాటాలకు పోవద్దు. సింపుల్ డ్రెస్సింగ్తో నీట్గా రెడీ అయితే ఎక్కువ మార్కులు కొట్టేయొచ్చు. కాస్లీ గిఫ్ట్ ఇస్తే ఎవరైనా తమ లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారని చాలా మంది అనుకుంటుంటారు. కానీ నిజమైన ప్రేమ ఉంటే ఓ రెడ్ రోజ్, చాక్లెట్ ఇచ్చినా చాలు. మీరు ప్రేమించే వారికి సర్ ప్రైజ్లు ఇష్టమైతే అలాంటి ప్లాన్ చేయొచ్చు. మోకాళ్లపై కూర్చుని పెళ్లి చేసుకోమని అడగడం. పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయడం జీవితాంతం గుర్తుండిపోతుంది.
ఎలాంటి ఆర్భాటాలు ఇష్టం లేకపోతే ఏ రెస్టారెంట్ కో వెళ్లి మనసులో మాట చెప్పేయడం బెటర్. సాధారణంగా సాయంత్రం సమయాల్లో ప్రపోజ్ చేయడం బెటర్ అన్నది లవ్ గురూలు చెప్పే సూచన. అందుకే చాలా మంది క్యాండిల్ లైట్ డిన్నర్ ప్రిఫర్ ఇస్తారు. అలా చేసే ప్రపోజల్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి.
వాలెంటైన్ వీక్ లో ప్రపోజ్ డే రోజు చాలా మంది లవ్ ప్రపోజ్ మాత్రమే చేస్తారు. కానీ పెళ్లి చేసుకుంటానని కూడా ప్రపోజ్ చేయొద్దు. అలా చేయడం వల్ల ఎదుటి వారు మీ జీవితంలో ఉండాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో వారికి అర్థమవుతుంది. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. అది ఏ వయసులో అయినా కలుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు ప్రేమించేవారికి మీ మనసులో మాట చెప్పేయండి. హ్యాపీ ప్రపోజ్ డే.