Nitin Gadkari : పబ్లిసిటీ కంటే పని ముఖ్యం.. నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
X
(Nitin Gadkari) కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో అవకాశవాదులే ఎక్కువగా ఉన్నారని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటగాకడమే కొందరు తమ పనిగా పెట్టుకుంటారని ఆరోపించారు. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే నాయకులు తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు పాటించే నాయకులు తగ్గుతుండడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. మంచిగా పని చేసేవారికి గౌరవం లభించదన్నారు.
మంచి చేసేవాడికి గౌరవం లభించదు.. చెడ్డ పనిచేసే వారికి శిక్ష పడదని గతంలో తాను సరదాగా చెప్పేవాడినని గడ్కరి గుర్తు చేశారు. అయితే అది ఎవరినీ ఉద్దేశించి అలా అన్నారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యమని చెప్పారు. మోదీ మాటల్లో చెప్పాలంటే భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదని వ్యాఖ్యానించారు. రాజకీయ నేతలు వస్తుంటారు.. పోతుంటారు కానీ వారు చేసిన అభివృద్ధే వారికి తగిన గౌరవం తెస్తుందని చెప్పారు. ప్రజాప్రతినిధులకు పబ్లిసిటీ కంటే నియోజకర్గాల్లో ప్రజల కోసమ చేసిన మంచి పనులే ప్రధానమన్నారు. పార్లమెంట్ గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత సభ్యులపై ఉందని స్పష్టం చేశారు.