Rahul Gandhi Lok Sabha : రాహుల్ సభ్యత్వం పునరుద్ధరణకు వ్యతిరేకంగా పిటిషన్
X
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలైంది. లక్నోకు చెందిన సీనియర్ లాయర్ అశోక్ పాండే ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ద్వారా.. వయనాడ్ ఎంపీగా రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్దరిస్తూ వచ్చిన లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ ను రద్దు చేయాలని అశోక్ కోరారు. కర్నాటక ఎన్నికల టైంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీ ఇంటి పేరు ఉన్నవాళ్లంతా దొంగలని వ్యాఖ్యానించారు.
దానిపై మోదీ ఇంటిపేరున్న గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ పరువు నష్టం దావా వేశారు. దీనిపై రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మార్చి 23న తీర్పు వచ్చింది. దానిపై స్టే విధిస్తూ ఆగస్ట్ 4న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో రాహుల్ పై లోక్ సభ అనర్హత వేటు తొలగిస్తున్నట్లు ఆగస్ట్ 7న లోక్ సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటు ఎంపీ సభ్యత్వం పునరుద్దరించడంతో ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు.