3 రోజులు పెట్రోల్ బంక్లు బంద్.. కారణం ఏంటంటే?
X
దేశంలో ఇంధన ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లీటర్ ఇంధనంపై ట్యాక్స్ లు భారీగా పెరిగిపోయాయి. ఈ కారణంతో సెప్టెంబర్ 13న పెట్రోల్ పంప్ లు తాత్కాలికంగా మూతపడనున్నాయి. 13, 14వ తేదీల్లో పెట్రోల్ బంక్ యాజమానులు బంద్ పాటించనున్నారు. 15వ తేదీన డీలర్లంతా కలిసి నిరవదిక సమ్మే చేయనున్నారు. అయితే వార్త విని కంగారు పడాల్సిన అవసరం లేదు. బంద్ పాటిస్తుంది మన రాష్ట్రంలో కాదు రాజస్థాన్ లో. పన్నులు తగ్గించాలనే డిమాండ్ తో రాజస్థాన్ పెట్రోల్ బంక్ డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంక్ ల బంద్ కు పిలుపు నిచ్చారు. సెప్టెంబర్ 13, 14వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగుతుంది.
ప్రస్తుతం రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ లో ఇంధన ధర ఎక్కువ ధర ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.112.74 పైసలు, డీజిల్ ధర రూ.97.57గా విక్రయిస్తున్నారు. దీంతోపాటు పోర్ట్ బ్లెయిర్ లో మాత్రం ఇవి చాలా చౌకగా దొరుకుతున్నాయి. పెట్రోల్ రూ.84.10కి, డీజిల్ రూ.79.74కు దొరుకుతుంది. అంతేకాకుండా దేశంలో చాలాచోట్ల లీటర్ పెట్రోల్ ధర రూ.వంద పైనే ఉంది. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్, తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, సిక్కిం, ఒడిశా, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర అధికంగా అమ్ముడవుతుంది.