Ayodhya Ram : అయోధ్య రాముడి ఫోటోలు లీక్..విచారణకు డిమాండ్ !
X
అయోధ్యలో బాలరాముడి ఫొటోలు బయటకు రావడంపై శ్రీరామ జన్మభూమి తీర్థ చీఫ్ ప్రీస్ట్ ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. ప్రాణ ప్రతిష్ఠ ముగిసే వరుకు శ్రీరాముడి కళ్లు చూపించకూడని..ప్రస్తుతం వైరల్ అవుతున్న విగ్రహం నిజం కాదని ఒక వేళ అవి రాముడి కళ్లే అయితే దానిపై విచారణ చేస్తాం ఫోటోలు ఎలా బయటకు వచ్చాయనే దానిపై ఆరా తీస్తాం అని ఆయన ఓ ఇంటర్వూలో వెల్లడించారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి మరో 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. రామాలయంలో రామ్ లల్లా విగ్రహాలు ప్రాణప్రతిష్ట కోసం ఎదురుచూస్తున్నాయి.
ఈ మహాఘట్టాన్ని తిలకించేందుకు దేశంలో కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో అయోధ్యలో ప్రతిష్టించే రాముడి విగ్రహం ఇదే నంటూ కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోల్ని చూసి భక్తులు కూడా తరిస్తున్నారు. ఈ సమయంలో అయోధ్య ట్రస్టు ప్రధాన అర్చకుడు బాంబు పేల్చారు. అయితే విశ్వహిందూ పరిషత్ తో పాటు అయోధ్య ఆలయ ట్రస్ట్ ఆఫీస్ బేరర్లు కూడా ఈ చిత్రాల లీక్ ను ఖండించారు. ఇలా లీక్ అయిన ఓ ఫొటోలో .. కర్నాటక నుండి తెచ్చిన నల్లరాతితో చెక్కిన విగ్రహం కళ్ళు కప్పబడి ఉంది. మరొకదానిలో విగ్రహం ముఖం కప్పబడి ఉంది. దీంతో భక్తుల్లో గందరగోళం నెలకొంది.