Home > జాతీయం > పోలీసు కస్టడీ నుంచి విడుదలైన పావురం..నేరం ఏం చేసిందంటే

పోలీసు కస్టడీ నుంచి విడుదలైన పావురం..నేరం ఏం చేసిందంటే

పోలీసు కస్టడీ నుంచి విడుదలైన పావురం..నేరం ఏం చేసిందంటే
X

8 నెలలుగా ఓ పావురం పోలీసు కస్టడీలో ఉంది. ఎట్టకేలకు ఆ పావురానికి ఇప్పుడు విముక్తి లభించింది. పోలీసు కస్టడీ నుంచి పావురం విడుదలైన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. గత ఏడాది మే నెలలో ముంబై పోర్టు వద్ద పావురం అనుమానంగా కనిపించింది. ఆ పావురం రెక్కలపై చైనా భాషలో అక్షరాలు రాసి ఉన్నాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ పావురం చైనా దేశానికి గూఢచర్యం చేస్తోందని అనుమానించారు. దీంతో పావురాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

పావురాన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత 8 నెలలుగా దాన్ని వెటర్నరీ హాస్పిటల్ వద్ద పంజరంలో ఉంచి తాళం వేశారు. ఆ పావురం ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు సుదీర్ఘంగా దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు ఆ పావురం ఎలాంటి గూఢచర్యానికి పాల్పడలేదని తేల్చారు. పావురాన్ని పంజరం నుంచి విడిపించారు. చైనా గూఢచర్యానికి, ఆ పావురానికి ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

పావురాన్ని అనవసరంగా బంధించారని పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ కార్యకర్తలు నిరసన తెలిపారు. పక్షిని విడిచి పెట్టాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పోలీసులు ఆ పావురాన్ని విడిచి పెట్టాల్సి వచ్చింది. పెటా కార్యకర్తల సమక్షంలో ఆ పావురాన్ని పంజరం నుంచి విడిపించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆ పావురం తైవాన్ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు తేల్చారు. ఆ పావురం వాటర్ రేసింగ్‌లో పాల్గొనేదిగా గుర్తించారు.

Updated : 3 Feb 2024 9:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top