Home > జాతీయం > రేపే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ సొమ్ము

రేపే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ సొమ్ము

రేపే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ సొమ్ము
X

రేపు నవంబర్ 15వ తేదీన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత సొమ్మును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద.. అన్నదాతలకు ఏడాదికి 6 వేల రూపాయలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అర్హులైన వారికి మూడు నెలలకు ఒకసారి 2000 రూపాయల చొప్పున విడుదల చేస్తోంది. ఇప్పటి వరకూ 14 విడతలుగా సొమ్మును రైతుల ఖాతాల్లో వేసిన కేంద్ర సర్కారు.. ఇప్పుడు 15వ సారి నగదు అకౌంట్లో జమ చేసేందుకు సిద్ధమైంది.

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అల్పాదాయ వర్గాలకు చెందిన సుమారు 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. 2023 ఏప్రిల్-మే మూడు నెలలకి సంబంధించిన డబ్బులు బ్యాంకులో జమ కావాల్సి ఉంది. వీటిని త్వరలోనే రైతుల ఖాతాల్లో వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ 15వ కిసాన్ సమ్మాన్ నిధులు.. రేపే అన్నదాతల ఖాతాల్లో పడనున్నాయి.

రైతులు పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఇకేవైసీ తప్పనిసరి చేయించాలి. అయితే ఇప్పటికీ ఇకేవైసీ చేయించని రైతులు ఉన్నారు. ఫలితంగా వారికి పీఎం కిసాన్ డబ్బులు జమ కావట్లేదు. కాబట్టి రైతులు ముందుగా ఇకేవైసీ తప్పనిసరిగా చేయించాలి. స్కీమ్‌కు అర్హులైన రైతులు ఇకేవైసీ చేయించని కారణంగా పీఎం కిసాన్ డబ్బుల్ని పొందట్లేదు. పీఎం కిసాన్ వెబ్‌సైట్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. రైతులు దరఖాస్తు ఫామ్‌లో చేసే పొరపాట్ల వల్ల కూడా పీఎం కిసాన్ డబ్బులు రావు. పేరు, అడ్రస్, జెండర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాంటి వివరాలు సరిగ్గా లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు జమ కావు. అందుకే రైతులు ఓసారి ఈ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. రైతులు దరఖాస్తు ఫామ్‌లో చేసే పొరపాట్ల వల్ల కూడా పీఎం కిసాన్ డబ్బులు రావు. అందుకే రైతులు ఓసారి ఈ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

Updated : 14 Nov 2023 11:53 AM IST
Tags:    
Next Story
Share it
Top