Home > జాతీయం > రైతన్న ఖాతాలో రూ. 2వేలు.. జాబితాలో మీ పేరుందా..! చెక్ చేసుకోండిలా..

రైతన్న ఖాతాలో రూ. 2వేలు.. జాబితాలో మీ పేరుందా..! చెక్ చేసుకోండిలా..

రైతన్న ఖాతాలో రూ. 2వేలు.. జాబితాలో మీ పేరుందా..! చెక్ చేసుకోండిలా..
X

అన్నదాతలకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. పీఎం కిసాన్ యోజన 14వ విడత నిధులను జులై 27న కేంద్రం విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందబోతున్నారు. ఈ నిధులను డీబీటీ ద్వారా రైతన్నల ఖాతాల్లోకి విడుదల చేశారు. 8 కోట్ల మంది రైతుల అకౌంట్స్ లో రూ. 16వేల కోట్ల రూపాయలు నగదు ట్రాన్స్ ఫర్ అయింది. అంతేకాకుండా రైతుల భూ రికార్డ్ పరిశీలన కూడా వేగంగా జరుగుతోంది. పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి జాబితా నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తుల పేర్లను తొలగించారు. ఈ ప్రథకాన్ని ప్రవేశ పెట్టినప్పుడు చాలామంది రైతులు ఇ-కేవైసీ అప్ డేట్ చేసుకోలేదు. దాంతో కిసాన్ యోజన పథకం జాబితానుంచి రైతుల పేర్లు తొలగించబడ్డాయి. ఈ క్రమంలో కొత్తగా చేర్చిబడిన పేర్ల జాబితా పీఎం కిసాన్ యోజన్ వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో మీ పేరుందో లేదో చూసుకోవాలంటే..

మొదట pmkisan.gov.in అధికారిక వెబ్ సైట్ లో లాగిన్ కావాలి.

లాగిన్ అయిన తర్వాత.. ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ లోకి వెళ్లి, లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయాలి.

తర్వాత రాష్ట్రం, జిల్లా, తహసీల్, బ్లాక్, గ్రామం పేరు నమోదు చేసి.. గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయాలి.

అప్పుడు రైతుల జాబితా వస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదే చెక్ చేసుకోవాలి. ఒక వేళ ఇందులో ఏదైనా సమస్య ఉంటే కింద సూచించే నంబర్స్ కు ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు.

ఏదైనా సమస్య ఉంటే.. అధికారిక మెయిల్ ఐడి pmkisan-ict@gov.in రిపోర్ట్ చేయాలి. లేదా.. 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 హెల్ప్‌లైన్ నంబర్స్ ను కూడా సంప్రదించొచ్చు.


Updated : 27 July 2023 6:28 PM IST
Tags:    
Next Story
Share it
Top