Home > జాతీయం > G20 Summit : మోదీతో అమెరికా అధక్షుడు బైడెన్ భేటీ

G20 Summit : మోదీతో అమెరికా అధక్షుడు బైడెన్ భేటీ

G20 Summit : మోదీతో అమెరికా అధక్షుడు బైడెన్ భేటీ
X

జీ20 సమ్మిట్కు ఢిల్లీ సిద్ధమైంది. సభ్యదేశాల నేతలు, ప్రతినిధులు దేశ రాజధానికి చేరుకుంటున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ సహా పలు దేశాధినేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. రేపు, ఎల్లుండి ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మరోవైపు ఢిల్లీ చేరుకున్న పలు దేశాధినేతలు ప్రధాని మోదీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పలువురు దేశాధినేతలతో సమావేశమైన మోదీ.. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ బైడెన్తో సమావేశమయ్యారు.

మోదీ - బైడెన్ ఇరుదేశాలకు సంబంధించి పలు కీలకాంశాలపై చర్చించారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. జీఈ జెట్ ఇంజిన్లు, న్యూక్లియర్ టెక్నాలజీని ఇచ్చిపుచ్చుకోవడానికి ఉద్దేశించిన ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. భారత పౌరులకు మరిన్ని హెచ్1 బీ విసాలను మంజూరు చేయడానికీ జో బైడెన్ అంగీకరించారు. దీనిపై తక్షణ చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ భేటీపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్ - అమెరికా సంబంధాల బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. ప్రపంచ అభివద్ధిలో ఇరుదేశాల స్నేహం గొప్ప పాత్ర పోషిస్తుందని చెప్పారు.


Updated : 8 Sept 2023 10:19 PM IST
Tags:    
Next Story
Share it
Top