మహారాష్ట్ర ఘోర బస్సు ప్రమాదం..ప్రధాని మోదీ సంతాపం
Mic Tv Desk | 1 July 2023 12:19 PM IST
X
X
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే సహా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద తీవ్రత గురించి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కొరికి రూ.5లక్షల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారు. ఇదిలా ఉండగా తాజాగా ప్రధాని మోదీ ఈ విషాధ సంఘటనపై స్పందించారు. మృతులకు సంతాపం వ్యక్తం చేయడంతో పాటు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల ఎక్స్గ్రేషియాను మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
Updated : 1 July 2023 12:19 PM IST
Tags: Maharashtra bus tragedy PM Modi announces Rs 2 lakhs exgratia to those who lost their lives in accident Maharashtra bus tragedy PM Modi announces Rs 2 lakhs exgratia accident
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire