Home > జాతీయం > ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు

ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు

ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు
X

చంద్రయాన్‌-3 రాకెట్‌ విజయవంతంగా భూ కక్ష్యలోకి చేరింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం-3 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మూడు దశల్లో రాకెట్‌ విజయం కావడంతో . శ్రీహారికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఒక చారిత్రాత్మక రోజని ఇస్రో పేర్కొంది.చంద్రయాన్‌-3 రాకెట్‌ విజయవంతంపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. చంద్రయాన్‌-3 చంద్రుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించిందని తెలిపారు

చంద్రయాన్‌-3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడంతో ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్-3 సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని కొనియాడారు. శాస్త్రవేత్తల అంకితభావానికి ఈ విజయం నిదర్శనమన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల స్ఫూర్తి, చాతుర్యానికి నమస్కరిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు.

విజయవంతంగా భూ కక్ష్యలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం 3ఎం 4రా కెట్‌ 24 రోజులపాటు భూ కక్షలోనే ప్రదక్షిణ చేయనుంది. తర్వాత చంద్రుడి వైపు పయనించనుంది.3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది.ఆగష్టు 23 లేదా 24 చంద్రుడి దక్షిణ ధృవంలో దిగనుంది. ఇది చంద్రుడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది.


Updated : 14 July 2023 4:40 PM IST
Tags:    
Next Story
Share it
Top