కేసీఆర్ కుటుంబం బాగుండాలంటే.. బీఆర్ఎస్కు ఓటేయండి: ప్రధాని మోదీ
X
ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంగళవారం (జూన్27) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన సభలో మాట్లాడిన మోదీ.. కుటుంబ రాజకీయాల గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కూతురు బాగుపడాలంటే మీ ఓటు బీఆర్ఎస్ కు వేయాలని.. మీ కుటుంబం బాగుపడాలంటే మీ ఓటు బీజేపీకి వేయాలని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం జరుగుతున్న వేళ.. మోదీ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి.
కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ విపక్షాలు విమర్శిస్తున్న క్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. బేజేపీకి దేశం, కార్యకర్తలే ముఖ్యం అన్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలో ప్రతిపక్షాల భేటీని కూడా మోదీ విమర్శించారు. భేటీలో పాల్గొన్న నాయకులందరూ కలిసి రూ.20 లక్షల కోట్ల స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ ఒక్కటే లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని విమర్శించారు.
ఎమ్మెల్సీ కవితపై మోడీ సంచలన వ్యాఖ్యలు
— Telugu Scribe (@TeluguScribe) June 27, 2023
కేసీఆర్ కూతురుకి లాభం చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి. మీకు, మీ పిల్లలకు, కుటుంబ సభ్యులకు మంచి జరగాలంటే బీజేపీకి ఓటు వేయండి - ప్రధాని మోడీ pic.twitter.com/gyhB2sQGkd