Home > జాతీయం > Rusted Iron Congress : ఆ పార్టీ తుప్పుపట్టిన ఇనుముతో సమానం..మోదీ

Rusted Iron Congress : ఆ పార్టీ తుప్పుపట్టిన ఇనుముతో సమానం..మోదీ

Rusted Iron Congress : ఆ పార్టీ తుప్పుపట్టిన ఇనుముతో సమానం..మోదీ
X

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. బీజేపీకి మళ్లీ అధికారం కట్టబెట్టకండంటూ ఓవైపు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండగా ఇటు బీజేపీ కూడా కాంగ్రెస్‎కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తోంది. తాజాగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్‎లోని భోపాల్‌లో జరిగిన కార్యకర్త మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్‎ను తుప్పుపట్టిన ఇనుముతో పోల్చి తీవ్ర విమర్శలు చేశారు.

కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ..." మధ్యప్రదేశ్ ప్రజలు బీజేపీకి మద్దతుగా ఉన్నారు. పార్టీ సిద్ధాంతాలకే కాకుండా అభివృద్ధికి ఈ ప్రాంతం కేంద్రబిందువుగా ఉంది. 20 ఏళ్లుగా బీజేపీ మధ్యప్రదేశ్‎లో అధికారంలో ఉంది. కొత్తగా ఓటు వేసే యువకులు అదృష్టవశాత్తు కాంగ్రెస్ పాలనను చూడలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని బీమార్ రాష్ట్రంగా మారిస్తే.. దానిని సరిచేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. వారసత్వ పాలిటిక్స్, కోట్లాది రూపాయల కుంభకోణాలు చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీకి జాతీయ ప్రయోజనాలను అర్థం చేసుకునేంత సామర్థ్యం లేదు. అందుకే ఈసారి జరగబోయే ఎన్నికలు ఎంతో కీలకం. కాంగ్రెస్‏ను అధికారంలోకి తీసుకువస్తే మధ్యప్రదేశ్‌కు తీరని నష్టం జరుగుతుంది. బీజేపీ ఒక హామీ ఇస్తే తప్పక దానిని నెరవేర్చుతుంది. మహిళా బిల్లు ఆమోదం పొందడం ఓ హిస్టరీ. మహిళలు చైతన్యవంతులుగా మారడమే అందుకు కారణం’ అని మోదీ తెలిపారు.




Updated : 25 Sept 2023 4:20 PM IST
Tags:    
Next Story
Share it
Top