Home > జాతీయం > ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. తొలిసారి కశ్మీర్‌కు ప్రధాని మోదీ

ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. తొలిసారి కశ్మీర్‌కు ప్రధాని మోదీ

ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. తొలిసారి కశ్మీర్‌కు ప్రధాని మోదీ
X

370వ అధికరణ రద్దు తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ నేడు కాశ్మీర్‌లో అడుగుపెట్టారు. 15వ కోర్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ప్రధాని పర్యటన పురస్కరించుకుని అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను భారీగా పెంచారు. గత నెల 20న మోదీ జమ్ములో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో కొత్త శిఖరాలను తాకుతోందని ప్రధాని మోదీ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ జమ్ముకశ్మీర్ ప్రజలను మాత్రమే కాదు, యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.

'చలో ఇండియా' కార్యక్రమం కింద కనీసం 5 మంది కుటుంబ సభ్యులను భారత పర్యటనకు పంపాలని ప్రవాస భారతీయులను ప్రధాని కోరారు.. శ్రీనగర్‌లో రూ.6400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. శ్రీనగర్‌లో గల స్టేడియంలో వికసిత్ భారత్ వికసిత్ కశ్మీర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. స్వదేశ్ దర్శన్, ప్రసాద్ ( కింద రూ.1400 కోట్లతో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. జమ్ము కశ్మీర్‌లో ఉద్యోగాలు పొందిన వెయ్యి మందికి అపాయింట్ మెంట్ లెటర్లను ప్రధాని మోదీ అందజేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్న పలువురితో ప్రధాని మోదీ సమావేశం అవుతారు. వారిలో మహిళలు, రైతులు, ఉంటారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మోదీ పాల్గొనే సభ వేదిక 2 కిలోమీటర్ల పరిధిలో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. జీలం నది, దాల్ సరస్సులో మెరైన్ కమాండోలను మొహరించారు.

Updated : 7 March 2024 2:39 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top