MODI : హిమాచల్‌ప్రదేశ్‌లొ ప్రధాని .. సైనికులతో దీపావళి
X
ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి పండుగను ఎప్పటిలాగే ఈసారి కూడా దేశ సైనికులతో జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం హిమాచల్ ప్రదేశ్‌లోని లేప్చా (Modi in Lepcha) సైనిక శిబిరాన్ని సందర్శించారు. అక్కడ భద్రతా బలగాలతో దీపావళి వేడుకలు జరుపుకునేందుకు వెళ్లారు. అక్కడ జవాన్లతో కలిసి పండగ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ మేరకు లెప్చాలో సైనికులతో మాట్లాడుతున్న పలు చిత్రాలను ఆయనే స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మిలిటరీ దుస్తులు, టోపీ ధరించిన మోదీ.. సైనికులతో ముచ్చటించారు. ఈ మేరకు అధికారికంగా ట్వీట్ చేశారు. అంతకు ముందు దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. "ఎంతో ధైర్యవంతులైన మన భద్రతా బలగాలతో దీపావళి వేడుకలు జరుపుకునేందుకు లేప్చాకి వచ్చాను" అంటూ ట్వీట్ చేశారు.
2014లో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి ఏటా ఇండియన్ ఆర్మీతోనే దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. 2014లో జమ్ముకశ్మీర్‌లోని సియాచెన్‌కి వెళ్లారు. ఆ తరవాతి సంవత్సరం అమృత్‌సర్‌కి వెళ్లారు. 2016లో హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహోల్ స్పీటికి వెళ్లి అక్కడి సైనికులతో దీపావళి వేడుకలు చేసుకున్నారు ప్రధాని. ఆ తరవాత 2017లో జమ్ముకశ్మీర్‌లోని గురెజ్ వ్యాలీకి వెళ్లారు. 2018లో ఉత్తరాఖండ్ చమోలిలో పండుగ చేసుకున్నారు. 2020లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో, 2021లో కశ్మీర్‌లోని నౌశేరా సెక్టార్‌కి వెళ్లారు. గతేడాది కార్గిల్‌కి వెళ్లిన ప్రధాని అక్కడే దీపావళి చేసుకున్నారు.