Home > జాతీయం > Namo Bharat Train: నమో భారత్ రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ.. దేశంలోనే మొదటిది

Namo Bharat Train: నమో భారత్ రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ.. దేశంలోనే మొదటిది

Namo Bharat Train: నమో భారత్ రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ.. దేశంలోనే మొదటిది
X

నమో భారత్ రైలు పట్టాలెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ పచ్చ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ప్రాంతీయ రైలు కావడం విశేషం. ఢిల్లీ నుంచి ఘజియాబాద్, మీరట్ మీదుగా RRTS కారిడార్ లో నమో భారత్ రైలు పరుగులు పెట్టింది. తొలి విడతలో 17కి.మీల పరిధిలో 5 స్టేషన్ల మధ్య అక్టోబర్‌ 21 నుంచి ఈ రైలు సర్వీసులు నడవనున్నాయి. ఢిల్లీ-ఘజియాబాద్‌-మేరఠ్‌ ఆర్‌ఆర్‌టీఎస్‌ కారిడార్‌కు ప్రధాని నరేంద్ర మోడీ 2019 మార్చి 8న శంకుస్థాపన చేశారు.

85.2 కి.మీ.ల మార్గం నిర్మాణాన్ని రూ.30వేల కోట్లతో చేపట్టారు. 2025 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రస్తుతం 17 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి కావడంతో దాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే ర్యాపిడ్‌ఎక్స్‌ రైళ్ల పేరు నమో భారత్‌గా మార్చడంపై కాంగ్రెస్‌ మండిపడుతోంది. ముందు నమో స్టేడియం ఇప్పుడు నమో రైళ్లు. సొంత ప్రచారానికి హద్దు లేకుండా పోయిందంటూ కాంగ్రెస్ సీనియర్‌ నేత జైరాం రమేశ్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. భారతదేశం పేరు కూడా అదే పేరుతో మార్చేస్తే సరిపోతుందని కదా అని మరో నేత పవన్ ఖేరా ట్వీట్ చేశారు.

Updated : 20 Oct 2023 3:04 PM IST
Tags:    
Next Story
Share it
Top