Home > జాతీయం > ఢిల్లీ మెట్రో ఫేజ్-4కు ప్రధాని శ్రీకారం

ఢిల్లీ మెట్రో ఫేజ్-4కు ప్రధాని శ్రీకారం

ఢిల్లీ మెట్రో ఫేజ్-4కు ప్రధాని శ్రీకారం
X

ఢిల్లీ మెట్రో ఫేజ్-4కు ప్రధాని మోదీ నేడు శంకు స్థాపన చేశారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రు స్టేడియానికి చేరుకున్న ప్రధాని మెట్రో పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. ఈఫేజ్‌లో భాగంగా ఢిల్లీలో కొత్త కారిడర్ నిర్మించనున్నారు.కొత్త కారిడార్లు ఇందర్‌లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు.. లజపత్ నగర్ నుంచి సాకేత్ జి బ్లాక్‌కు అనుసంధానం చేయబడతాయి. దాదాపు 20 కిలోమీటర్ల మేర ఈ మెట్రో నిర్మాణం జరగనుంది. దీని ద్వారా కనెక్టివిటీ సుగమం అయితే ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. అలాగే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రజలకు తాయిలాలు కూడా ప్రకటించారు. ఇటీవల మహిళల కోసం వంట గ్యాస్ రూ.100 తగ్గించారు. అలాగే సీఏఏ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.ఈ రెండు కారిడార్ల మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 8,399 కోట్లు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నిధులను సమకూరుస్తాయని ఆయన తెలిపారు. ఈ రెండు లైన్ల పొడవు 20.762 కిలోమీటర్లని ఆయన చెప్పారు. ఇంద్రలోక్–ఇంద్రప్రస్థ కారిడార్ గ్రీన్ లైన్ విస్తరణ కిందకు వస్తుంది. రెడ్, ఎల్లో, ఎయిర్‌పోర్ట్ లైన్, మెజెంటా, వైలెట్, బ్లూ లైన్లతో ఇంటర్‌చేంజ్ ఉంటుంది. ఇక లజ్‌పత్ నగర్-సాకేత్ జి బ్లాక్ కారిడార్ సిల్వర్, మెజెంటా, పింక్, వైలెట్ లైన్లను కలుపుతుంది.

Updated : 14 March 2024 1:34 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top