Modi : కల్కీ ధామ్ ఆలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన
X
ఉత్తరప్రదేశ్‌లో కల్కీ ధామ్ ఆలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. శ్రీ కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్టు ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది. ట్రస్ట్ చైర్మన్ ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ ఆహ్వానం మేరకు ప్రధాని ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి పాల్గొన్నారు. ప్రమోద్ కృష్ణమ్ను పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ ఇటీవలే బహిష్కరించింది. కాగా సాధువులు, ఆచార్యుల సమక్షంలో ఆలయానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు.
భారతీయ విశ్వాసాలకు కల్కి ధామ్ కేంద్రంగా మారుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. సాధువులు, ప్రజల భక్తి వల్లే ఈ ఆలయ నిర్మాణాన్ని నాంది పడిందని చెప్పారు. బీజేపీ హయాంలోనూ కాశీ విశ్వనాథ్ ధామ్, ఉజ్జయని మహాకాల్, కేదర్ నాథ్, సోమనాథ్ ఆలయాల అభివృద్ధి జరిగిందన్నారు. ఒకవైపు ఆలయాల అభివృద్ధితో పాటు మరోవైపు నగరాలను అన్నీ విధాల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆలయాల పునర్నిర్మాణాలతో పాటు ఆస్పత్రులను సైతం నిర్మిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా విదేశాల్లో ఉన్న భారత శిల్పాలను తిరిగి స్వదేశానికి తెప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.