Home > జాతీయం > 100 కోట్లతో సంత్ రవిదాస్ ఆలయం.. మోదీ శంకుస్థాపన

100 కోట్లతో సంత్ రవిదాస్ ఆలయం.. మోదీ శంకుస్థాపన

100 కోట్లతో సంత్ రవిదాస్ ఆలయం.. మోదీ శంకుస్థాపన
X

సంత్ రవిదాస్.. 14వ శతాబ్దపు ఆధ్యాత్మిక కవి, సంఘ సంస్కర్త. దళిత సమాజానికి ఆరాధ్యుడు. కుల, లింగ అసమానతలపై ఎన్నో రచనలు చేశారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో 100 కోట్లతో ఆయన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ప్రధాని మోదీ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అందరూ రవిదాస్ మార్గాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. మొత్తం 11 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఆలయంలో మ్యూజియాన్ని సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆలయాన్ని నగరా శైలిలో నిర్మించనున్నారు.

ఆలయంలో ఏర్పాటు చేసే మ్యూజియంలో రవిదాస్ తత్వబోధనలు, భక్తిమార్గం, సాహిత్యం వంటివి భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు.ఈ ఆలయం నిర్మితమైతే దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఆలయంలో గ్రంథాలయం, సమావేశ మందిరం, జలకుంద్, భక్తి నివాస్ సహా 15వేల చదరపు అడుగుల విస్తీర్ణయంలో భోజనశాల కూడా నిర్మించనున్నారు. సంత్ రవిదాస్ 14వ శతాబ్దపు ఆధ్యాత్మిక కవి.

ఇప్పటికే మైహర్ లో రవిదాస్ ఆలయాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్మించింది. ఇక సాగర్ జిల్లాలో 20-25శాతం దళిత జనాభా ఉంది.మధ్యప్రదేశ్ లోని 230 అసెంబ్లీ స్థానాల్లో 35 ఎస్సీ రిజర్వ్డ్. 2013లో వీటిలో 28 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ గత ఎన్నికల్లో అందులోని 10 స్థానాలను కోల్పోయింది. గత ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాలను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ 17 స్థానాల్లో విజయం సాధించింది. కాగా మధ్యప్రదేశ్లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.




Updated : 12 Aug 2023 7:30 PM IST
Tags:    
Next Story
Share it
Top