సౌదీ యువరాజుతో మోదీ కీలక భేటీ
X
సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ యువరాజుతో భేటీ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ద్వైపాక్షిక చర్చలను నిర్వహించారు. ఈ కీలకమైన భేటీలో వాణిజ్యం, ఆర్థికం, రక్షణ, సాంస్కృతిక సహకారంపై ప్రధానంగా ఇరు నేతలు చర్చించారు. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. భారత దేశానికి అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని ఈ సందర్భంగా మోదీ అన్నారు. గొప్ప భవిష్యత్తు కోసం రెండు దేశాలు కలిసి పని చేస్తాయని సౌదీ యువరాజు తెలిపారు.
మోదీ మాట్లాడుతూ.." రెండు దేశాల పార్టనర్షిప్ను మరింత బలోపేతం చేసేందుకు విభిన్న మార్గాలను అన్వేషిస్తున్నాము. ప్రపంచ సంక్షేమం కోసం ఈ రెండు దేశాల భాగస్వామ్యం అత్యంత కీలకం. కాలానికి అనుగుణంగా మా సంబంధాలకు కొత్త కోణాన్ని జోడిస్తున్నాం. ఈ పార్టనర్షిప్ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం" అని మోదీ అన్నారు.
ఇక సౌదీ యువరాజు మాట్లాడుతూ.." భారత్‌లో పర్యటించడం ఆనందంగా ఉంది. జీ20 వంటి సదస్సులను నిర్వహించినందుకు భారత్‌కు నా అభినందనలు. జీ20తో ప్రపంచమంతా ఎన్నో ప్రయోజనాలను పొందుతుంది. ఈ సదస్సులో కీలకమైన ప్రకటనలు చేసే ఛాన్స్ దక్కింది.భారత్, సౌదీ ఈ రెండు దేశాలు గొప్ప భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పనిచేస్తాయి"అని యువరాజు తెలిపారు. భారత్‌లో మహ్మద్ బిన్ పర్యటించడం ఇది రెండోసారి.
#WATCH | Crown Prince and Prime Minister of the Kingdom of Saudi Arabia Prince Mohammed bin Salman bin Abdulaziz Al Saud met Prime Minister Narendra Modi at Hyderabad House in Delhi. pic.twitter.com/QEiLHbIgQY
— ANI (@ANI) September 11, 2023