అయోధ్య ప్రాణప్రతిష్ఠ.. ప్రధాని మోదీ ఎమోషనల్
X
అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కోసం యావత్ భారతావని ఎదురు చూస్తోంది. జనవరి 22న జరగనున్న ఈ మహోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 14 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దీనికి సంబంధించి మోదీ ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. రాముని ప్రాణప్రతిష్ఠను కనులారా వీక్షించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం.. ప్రపంచంలో ఉన్న రామ భక్తులందరికీ ప్రవిత్రమైన సందర్భమని చెప్పారు
'' అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠకు ఇంకా 11 రోజులే ఉంది. ఈ మహోత్సవానికి దేశ ప్రజల తరఫున ప్రతినిధిగా ఉండటం నా అదృష్టం. ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు ప్రత్యేక ఆరాధన ప్రారంభిస్తున్నాను. ప్రస్తుతం నేను ఎంతో భావోద్వేగంతో ఉన్నాను. నా జీవితంలో తొలిసారి ఇలా అనిపిస్తోంది. దేవుడి ఆశీస్సుల వల్లే కొన్ని వాస్తవ రూపం దాల్చుతాయి'' అని మోదీ అన్నారు.