Home > జాతీయం > ఆధార్ కార్డు ఉన్నోళ్లకు.. రూ. 3లక్షల లోన్.. క్లారిటీ!

ఆధార్ కార్డు ఉన్నోళ్లకు.. రూ. 3లక్షల లోన్.. క్లారిటీ!

ఆధార్ కార్డు ఉన్నోళ్లకు.. రూ. 3లక్షల లోన్.. క్లారిటీ!
X

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఫేక్ వార్తలు భారీగా చక్కర్లు కొడుతున్నాయి. అందులో గవర్నమెంట్ స్కీమ్స్ పై విపరీతమైన పుకార్లు పుట్టుకొస్తున్నాయి. కొత్త పాలసీ ప్రవేశపెట్టారని, రిజిస్టర్ అయితే చాలు లోన్లు వస్తాయని, గిఫ్ట్స్ వోచర్స్ ఇస్తారంటూ వార్తలు వస్తుంటాయి. ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్స్, ల్యాప్ టాప్స్ ఇస్తుంది.. కింద లింక్స్ క్లిక్ చేయండంటూ ఫేక్ లింక్స్ వస్తుంటాయి. వాటిని క్లిక్ చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే తాజాగా మరోవార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఆధార్డ్ కార్డ్ ఉన్నవాళ్లకు కేంద్ర ప్రభుత్వం రూ. 3 లక్షల లోన్లు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.





ప్రధాన మంత్రి లోన్ యోజన కింద ఆధార్ కార్డుపై ప్రతి ఒక్కరికీ రూ.3 లక్షల లోన్ వస్తున్నట్లు ఓ మెసేజ్ వస్తోంది. ఇది నిజమో కాదో తెలుసుకోపి ప్రజలు.. లోన్ కు అప్లే చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వార్తపై కేంద్ర ప్రభుత్వ PIBFactCheck స్పందించింది. ఈ మెసేజ్ ఫేక్ అని, ప్రభుత్వం ఆధార్ కార్డ్ పై ఎలాంటి లోన్లు ఇవ్వట్లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వార్తలు నమ్మొద్దని.. ఇవి నిజమా? కాదా? అని తెలుసుకోకుండా ఆధార్ వివరాలు ఎవరికీ షేర్ చేయొద్దని సూచించింది.




Updated : 14 Aug 2023 6:36 PM IST
Tags:    
Next Story
Share it
Top