Home > జాతీయం > PM Modi : ప్రధాని మోదీకి 15 అంతర్జాతీయ అవార్డులు

PM Modi : ప్రధాని మోదీకి 15 అంతర్జాతీయ అవార్డులు

PM Modi : ప్రధాని మోదీకి 15 అంతర్జాతీయ అవార్డులు
X

ప్రధాని మోదీకి ఇప్పటివరకు 15 అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం బదులిచ్చింది. ప్రధాని మోదీకి 2014 నుంచి ఇప్పటివరకు ఎన్ని అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని రాజ్యసభలో జీవీఎల్ అడిగారు. తన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జవాబు చెప్పిందని జీవీఎల్ చెప్పారు. మోదీకి ఇప్పటివరకు 14 దేశాల అంతర్జాతీయ అవార్డులతో పాటు ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం కూడా వచ్చినట్లు కేంద్రం తెలిపిందని జీవీఎల్ వివరించారు. దీంతో ప్రపంచ దేశాలు భారత ప్రధాని నాయకత్వాన్ని బలపరిచినట్టు స్పష్టమైందని అన్నారు.

మోదీకి లభించిన అంతర్జాతీయ అవార్డులివే..

1. సాష్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్ (సౌదీ అరేబియా) - ఏప్రిల్ 3, 2016

2. స్టేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్)- జూన్ 4, 2016

3. గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా (పాలస్తీనా)- ఫిబ్రవరి 10, 2018

4. యూఎన్ చాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు (ఐక్యరాజ్యసమితి)- అక్టోబరు 3, 2018

5. ఆర్డర్ ఆఫ్ జయేద్ (యూఏఈ)- ఏప్రిల్ 4, 2019

6. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ (రష్యా)- ఏప్రిల్ 12, 2019

7. ఆర్డర్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ ఇజుద్దీన్ (మాల్దీవులు)- జూన్ 8, 2019

8. కింగ్ హమాద్ ఆర్డర్ ఆఫ్ ద రెనెయిస్సాన్స్ (బహ్రెయిన్)- ఆగస్టు 24, 2019

9. లెజియన్ ఆఫ్ మెరిట్ (అమెరికా)- డిసెంబరు 21, 2020

10. ఆర్డర్ ఆఫ్ ద డ్రాగన్ కింగ్ (భూటాన్)- డిసెంబరు 17, 2021

11. ఆర్డర్ ఆఫ్ ఫిజి (ఫిజి)- మే 22, 2023

12. ఆర్డర్ ఆఫ్ లోగోహు (పాపువా న్యూ గినియా)- మే 22, 2023

13. ఆర్డర్ ఆఫ్ ద నైల్ (ఈజిప్టు)- జూన్ 25, 2023

14. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్ (ఫ్రాన్స్)- జులై 13, 2023

15. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆనర్ (గ్రీస్)- ఆగస్టు 25, 2023


Updated : 16 Dec 2023 8:51 AM IST
Tags:    
Next Story
Share it
Top