Independence Day: నెహ్రూ 24 నిమిషాలే, మోదీ ఎన్ని నిమిషాలంటే..
X
ప్రధాని నరేంద్ర మోదీ 77వ పంద్రాగస్టు వేడుకల్లో రెండు రికార్డులు సృష్టించారు. వరుసగా పదేళ్లపాటు ఎర్రకోట మీద నుంచి జాతీయ జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయారు. అంతేకాకుండా, ఎర్రకోటపై నుంచి ఎక్కువ సేపు ప్రసంగించిన తొలి ప్రధానిగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు. మంగళవారం నాటి పంద్రాగస్టు వేడుకలో ఆయన ఏకంగా 90 నిమిషాలు ప్రసంగించారు. పదేళ్లలో మోదీ చేసిన ఎర్రకోట ప్రసంగాల సగటు నిడివి 82 నిమిషాలు కాగా, ఈసారి మరో 8 నినిమిషాలు ఎక్కువ సేపు మాట్లాడారు. మొత్తం 82 నిమిషాల సగటు ప్రసంగం చేసిన ఏకైక ప్రధానిగా నిలిచారు. దేశ ప్రగతి అంతా బీజేపీ ప్రభుత్వ ఘనతే అన్నట్టు సాగిందాయన ఉపన్యాసం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి 1947 పంద్రాగస్టున నెహ్రూ చేసిన తొలి ఎర్రకోట ప్రసంగం 24 నిమిషాలు మాత్రమే. ఇప్పటి వరకు ఎక్కవసార్లు ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగరేసిన ఘనత కూడా నెహ్రూదే. ఆయన 17సార్లు పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత స్థానంలో ఇందిరమ్మ ఉన్నారు. ఆమె 16 సార్లు పతాకావిష్కరణ చేశారు.
మోదీ ప్రసంగాల నిడివి
2014లో 65 నిమిషాలు
2015లో 88 నిమిషాలు
2016లో 94 నిమిషాలు
2017లో 56 నిమిషాలు
2018లో 83 నిమిషాలు
2019లో 92 నిమిషాలు
2020లో 90 నిమిషాలు
2021లో 88 నిమిషాలు
2022లో 83 నిమిషాలు
2023లో 90 నిమిషాలు