Home > జాతీయం > వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయి : Modi

వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయి : Modi

వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయి : Modi
X

18 ఏళ్లు నిండినవారంతా 18వ లోక్ సభకు ఓటు వేయబోతున్నారని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రెండో రోజు బీజేపీ జాతీయ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. వచ్చే 100 రోజులు చాలా ముఖ్యమని.. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. నవ భారత్ నిర్మాణం కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఇంకా చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు.

తనకు కుటుంబం ముఖ్యం కాదని.. దేశ ప్రజలే తన కుటుంబమని మోదీ అన్నారు. ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ వ్యవస్థలు అలాగే ఉంటాయన్నారు. గత పదేళ్లలో ఎన్నో వ్యవస్థలను పటిష్ఠం చేశామని చెప్పారు. భారత్ను మూడవ ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. గత పదేళ్లలో అవినీతి రహిత పాలన అందించామన్నారు. ‘‘ నన్ను విశ్రాంతి తీసుకోమని కొందరు సూచిస్తున్నారు. కానీ నాకు రాజకీయాలు ముఖ్యం కాదు దేశమే ముఖ్యం’’ అని మోదీ అన్నారు.

బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్నారని మోదీ అన్నారు. మహిళా సాధికారతే తమ ప్రధాన లక్ష్యమన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అయోధ్యలో రామమందిరాన్ని పూర్తి చేసి.. వందల ఏళ్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చామన్నారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేయడంతో పాటు రాజ్పథ్ను కర్తవ్య పథ్గా మార్చామని చెప్పారు. కొత్త పార్లమెంట్ నిర్మించడంతో పాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. కానీ విపక్షాలు మాత్రం అబద్ధపు హామీలు ఇవ్వడంలో పోటీపడుతున్నాయని విమర్శించారు.

Updated : 18 Feb 2024 9:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top