Home > జాతీయం > ఔను..సీఎంని నేనే రావొద్దన్నా..ప్రధాని మోదీ

ఔను..సీఎంని నేనే రావొద్దన్నా..ప్రధాని మోదీ

ఔను..సీఎంని నేనే రావొద్దన్నా..ప్రధాని మోదీ
X

భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం బెంగళూరు చేరుకున్న మోదీకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం లు హాజరుకాకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రధాని కావాలనే వారిని విమానాశ్రయానికి రావొద్దన్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా వాటిపై స్పందించిన ప్రధానీ మోదీ కాంగ్రెస్‎కు కౌంటర్ ఇచ్చారు.





"తనకంటే ముందుగా కర్ణాటక సీఎం, డెప్యూటీ సీఎం ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడంపై ప్రధాని చాలా చికాకుగా ఉన్నారు. అందుకే ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. మోదీ ఉద్దేశపూర్వకంగానే వారిద్దరినీ ఎయిర్‌పోర్టుకు రాకుండా చేశారు. ఇలాంటి రాజకీయాలు నవ్వు తెప్పిస్తున్నాయి. చంద్రయాన్‌-1 సక్సెస్ అయినప్పుడు, 2008లో అప్పటి పీఎం మన్మోహన్ సింగ్ కంటే ముందుగానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ.. అహ్మదాబాద్‌లోని స్పేస్ సెంటర్‌కు వెళ్లి శాస్త్రవేత్తలను కలిశారు. ఈ విషయాన్ని మోదీ మర్చిపోయారా..?"అంటూ కాంగ్రెస్‌ నాయకుడు జైరాం రమేశ్‌ ప్రధానిని విమర్శించారు.





దీనిపై మోదీ తాజాగా మోదీ స్పందించారు. కాంగ్రెస్‎కు తనదైన స్టైల్‏లో కౌంటర్ ఇచ్చారు. బెంగళూరులోని హాల్‌ ఎయిర్‌పోర్టు బయట మోదీ మాట్లాడుతూ.. "ఔను సీఎంని నేనే రావొద్దన్నాను. నేను బెంగళూరుకు ఏ సమయంలో వెళ్తానో కచ్చితంగా తెలీదు. అందుకే ప్రొటోకాల్ ఫాలో అయ్యి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంలను ఇబ్బంది పెట్టాలనుకోలేదు" అని మోదీ క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం గ్రీస్ దేశ పర్యటనను ముగించుకుని మోదీ శనివారం ఉదయం నేరుగా బెంగళూరు చేరుకున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో ఆయన స్పేస్ సెంటర్‎కు వెళ్లి శాస్త్రవేత్తలతో మాట్లాడారు. వారి కృషికి ఆయన సెల్యూట్ చేశారు. ఈ క్రమంలో చంద్రయాన్‌-3 ప్రయోగం తీరును ఇస్రో చీఫ్ సోమనాథ్‌ ప్రధానికి వివరించారు.




Updated : 26 Aug 2023 1:27 PM IST
Tags:    
Next Story
Share it
Top