Home > జాతీయం > మోదీతో బంగ్లాదేశ్, మారిషస్‌ ప్రధానుల భేటీ..

మోదీతో బంగ్లాదేశ్, మారిషస్‌ ప్రధానుల భేటీ..

మోదీతో బంగ్లాదేశ్, మారిషస్‌ ప్రధానుల భేటీ..
X

జీ20 సమ్మిట్కు ఢిల్లీ సిద్ధమైంది. సభ్యదేశాల నేతలు, ప్రతినిధులు దేశ రాజధానికి చేరుకుంటున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ సహా పలు దేశాధినేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు ఢిల్లీ చేరుకున్న పలు దేశాధినేతలు ప్రధాని మోదీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనాతో మోదీ భేటీ అయ్యారు.

ఈ సమావేశానికి సంబంధించి మోదీ ట్వీట్ చేశారు. తమ మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయన్నారు. గత తొమ్మిదేళ్లలో భారత్‌- బంగ్లాదేశ్ సంబంధాలు ఎంతగానో వృద్ధి చెందాయని చెప్పారు. కనెక్టివిటీ, వాణిజ్యం సహా పలు అంశాలపై హసీనాతో చర్చించినట్టు మోదీ ట్విట్టర్లో తెలిపారు.

ఆ తర్వాత మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌తో మోదీ సమావేశమయ్యారు. తమ మధ్య సమావేశం బాగా జరిగిందని ట్వీట్‌ చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తైనందున ఇది భారత్‌-మారిషస్ సంబంధాలకు ప్రత్యేక ఏడాది అని అన్నారు. మౌలిక వసతులు, ఫిన్‌టెక్, సంస్కృతి, తదితర రంగాల్లో సహకారంపై చర్చించినట్లు చెప్పారు.


Updated : 8 Sept 2023 8:46 PM IST
Tags:    
Next Story
Share it
Top