Home > జాతీయం > RAPIDX train: వందేభారత్ తరహా మరో రైలు.. త్వరలో అందుబాటులోకి

RAPIDX train: వందేభారత్ తరహా మరో రైలు.. త్వరలో అందుబాటులోకి

RAPIDX train: వందేభారత్ తరహా మరో రైలు.. త్వరలో అందుబాటులోకి
X

వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను మించిన రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ ను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా రూపుదిద్దుకున్న ర్యాపిడ్‌ఎక్స్‌ హైస్పీడ్ రైళ్లను శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఎన్నో అధునాతన వసతులు ఉన్న ఈ రైళ్లు గంటకు 160 కిలోమీట్ల స్పీడ్ తో ప్రయాణిస్తాయి. దేశంలోనే తొలిసారి ఢిల్లీ- ఘజియాబాద్‌ రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ కారిడార్‌లో.. సాహిబాబాద్‌- దుహై డిపో మధ్యలో ఈ రైళ్లు దూసుకెళ్లనున్నాయి. ఈ క్రమంలో ఈ రైళ్లలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు..

శుక్రవారం మోదీ ప్రారంభించిన తర్వాత.. అక్టోబర్ 21 నుంచి ఈ రైళ్లు పూర్తి స్థాయిలో సేవలందించనున్నారు. సాహిబాబాద్ నుంచి దుహై డిపో మధ్యున్న ఐదు స్టేషన్ల (సాహిబాబాద్‌, ఘజియాబాద్‌, గుల్దర్‌, దుహై, దుహై డిపో) మీదుగా మొదటి రైలు సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఈ రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు చొప్పున సర్వీసు ఉంటుంది. ఈ రైలుకున్న ఆరు కోచ్ ల ద్వారా ఓకే టైంలో 1700 మంది ప్రయాణించొచ్చు. స్టాండర్డ్ కోచ్ లలో కనీస టికెట్ ధర రూ. 20 ఉండగా.. ప్రీమియం కోచ్ లలో రూ.40గా ఉంది.




Updated : 19 Oct 2023 6:17 PM IST
Tags:    
Next Story
Share it
Top