Home > జాతీయం > సౌతాఫ్రికా నుంచి చంద్రయాన్-3 లైవ్ చూడనున్న మోదీ

సౌతాఫ్రికా నుంచి చంద్రయాన్-3 లైవ్ చూడనున్న మోదీ

సౌతాఫ్రికా నుంచి చంద్రయాన్-3 లైవ్ చూడనున్న మోదీ
X

భారత్ గర్వించే క్షణాలకు సమయం ఆసన్నమవుతోంది. అద్భుత ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. జాబిల్లిపై ఇస్రో పంపిన చంద్రయాన్ -3 మరికొద్ది గంటల్లో కాలు మోపనుంది. ఈ అపూరూప దృశ్యం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 5.44 గంటల తర్వాత ల్యాండింగ్ ప్రక్రియ మొదలుకానుంది. సాయంత్రం 6.04 గంటలకు ఆర్టిట్ నుంచి ల్యాండర్ విడిపోయి జాబిల్లిపై దిగనుంది. 17 నిమిషాలపాటు సాగే ఈ ప్రక్రియ అత్యంత సంక్లిష్టం.

ఈ చరిత్రాత్మక క్షణాలను భారతావని మొత్తం లైవ్ లో చూసే ఏర్పాట్లు చేసింది ఇస్రో. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సౌతాఫ్రికా నుంచి భాగస్వాములవుతారు. 15వ బ్రిక్స్ సమావేశాలపై కోసం సౌతాఫ్రికా వెళ్లిన ప్రధాని అక్కడి నంచే ఈ అద్భుత దృశ్యాన్ని తిలకిస్తారు.

ఇస్రో ల్యాండర్ దక్షిణ ధృవంపై సేఫ్ట్ ల్యాండ్ అయితే చంద్రుడిపై ల్యాండర్-రోవర్‌ను దింపిన ఘనత అమెరికా, రష్యా, చైనాల తర్వాత భారతదేశానికే దక్కుతుంది. అదేవిధంగా దక్షిణ ధృవంపై దిగిన మొదటి దేశంగా నిలవనుంది. ల్యాండర్ సురక్షితంగా దిగాలని దేశవ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Updated : 23 Aug 2023 3:40 PM IST
Tags:    
Next Story
Share it
Top