దేశం బాగుపడాలంటే బలమైన ప్రభుత్వం కావాలి.. మోదీ
X
భారత్ భిన్న కులమతాల సంగమమని, అన్ని వర్గాల సంక్షేమం కోసం దేశ ప్రజలు ఏకం కావాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మన దేశాన్ని చిన్నచూపు చూసిన ప్రపంచం ఇప్పుడు మన విజయాలను చూసి ఆశ్చర్యపోతోందన్నారు. దేశంలో యువశక్తికి కొరత లేదని, ప్రజలు స్నేహసామరస్యాలతో దేశ ప్రగతి కోసం పాటుపడాలన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన మంగళవారం ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేశారు. తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
‘‘భారత్ అకుంఠిత కృషితో చరిత్రను తిరగరాస్తోంది. 30 ఏళ్లలోపు వయసున్న ఉన్నవారే దేశానికి ఆశకాకిరణాలు. అన్ని వర్గాల సంక్షేమ కోసం నిర్ణయాత్మక సంస్కరణలు అవసరం. బలమైన ప్రభుత్వం ఉంటేనే సంస్కరణలు సాధ్యం. దేశం చేపడుతున్న ప్రతి సంస్కరణలోనూ ఒక పరమార్థం ఉంది. మన తీసుకునే ఒక నిర్ణయం వెయ్యేళ్ల వరకు ప్రభావం చూపుతుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలవాన్నది మన లక్ష్యం’’ అని మోదీ అన్నారు. దేశం వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతి, మౌలిక సదుపాయల కల్పన, విదేశా వాణిజ్యం సహా అన్ని రంగాల్లో ముందంజలో దూసుకుపోతోందన్న మోదీ విజయాలను ఏకరవు పెట్టారు. సామాన్యులకు భారం కాకుండా ఆదాయ పన్నుపరిమితిని పెంచామన్నారు. డిజిటల్ విప్లవంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించామని, ప్రపంచాన్ని మార్చడంతో భారత్‌ది కీలకపాత్ర అని తేల్చి చెప్పారు. ‘‘మన ఎగుమతులు ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటున్నాయి. పేదలకు జీవితాన్ని మరింత మెరుగుపరచడానికి దేశం కట్టుబడి ఉంది. జన ఔషధితో కేంద్రాలను 10 వేల నుంచి 25 వేలకు పెంచాం. 2 కోట్ల మంది మహిళను లక్షాధికారులను చేయడమే మన లక్ష్యం. దేశ ప్రగతితో మహిళా శక్తి కీలకం. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో అమ్మాయిలు ముందంజలో ఉన్నారు. కరోనా తర్వాత భారత్ శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసివచ్చింది. మానవాళి వికాసమే మనదేశ ఆశయం. ప్రపంచానికి కొత్త నమ్మకం కలిగించాం’’ అని అన్నారు.
దేశమ మణిపుర్ వెంటే
దేశంలో శాంతిభద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయని మోదీ తెలిపారు. గతంలో ఎప్పుడూ ఏదోచోట బాంబుదాడులు జరిగివేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయి దేశం సురక్షితంగా ఉందని అన్నారు. ఉగ్రవాదం, నక్సలిజం తగ్గుముఖం పట్టాయని, దేశం కొత్త ఆశలతో ముందకు వెళ్తోందన్నారు. మణిపుర్ హింసాకాండను ప్రస్తావిస్తూ శాంతిభద్రతను పునరుద్ధరిస్తున్నామని, దేశమంతా మణిపుర్ వెంట ఉందని అన్నారు. ‘‘మణిపుర్‌లో తర్వలోనే శాంతి ఏర్పడుతుంది. ఆ హింస గర్హినీయం. చిన్నచిన్న సమస్యలే ఇబ్బందిగా మారతున్నాయి. వీటిని అధిగమిస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారు.