Home > జాతీయం > PM Modi : దేశ ప్రజలకు ప్రధాని మోదీ న్యూ ఇయర్ విషెస్

PM Modi : దేశ ప్రజలకు ప్రధాని మోదీ న్యూ ఇయర్ విషెస్

PM Modi  : దేశ ప్రజలకు ప్రధాని మోదీ న్యూ ఇయర్ విషెస్
X

దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' ఎపిసోడ్‌లో మాట్లాడుతూ... ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించిందని అన్నారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఆమోదం పొందిందని పేర్కొన్నారు. జీ20 విజయవంతం, భారత్‌ ఐదో ఆర్థిక వ్యవస్థగా మారడంపై ప్రజలు లేఖలు రాసి సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. నాటునాటు పాటకు ఆస్కార్ వరించింది. ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’కు సైతం ప్రతిష్ఠాత్మక అవార్డు రావటంతో భారతీయుల ప్రతిభ వెలుగుచూసిందని వ్యాఖ్యానించారు

వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు అందరి మనసులు దోచిందని తెలిపారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలతో సత్తాచాటారని గుర్తు చేశారు. చంద్రయాన్‌-3 విజయవంతంపై చాలా మంది తనకు సందేశాలు పంపుతున్నారని మోదీ తెలిపారు. శాస్త్రవేత్తల కృషితో ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం విజయవంతమైందని.. ఇది అందరికీ గర్వకారణమని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లోని ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని అన్నారు. దేశ ప్రజలు వికసిత్‌, ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తిని 2024 లోనూ ఇలాగే కొనసాగించాలని మోదీ అన్నారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన స్పందన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.




Updated : 31 Dec 2023 12:50 PM IST
Tags:    
Next Story
Share it
Top